అమెరికాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి..

Update: 2020-08-10 09:04 GMT

ఆదివారం తెల్లవారుజామున వాషింగ్టన్ డి.సి.లో ఓ బహిరంగ పార్టీలో తుపాకీ కాల్పుల కలకలం రేగింది, దీంతో ఓ వ్యక్తి మరణించాడు.. మరో 20 మంది గాయపడ్డారు, వీరిలో ఆఫ్-డ్యూటీ అధికారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో 17 ఏళ్ల వ్యక్తి మరణించాడని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ పీటర్ అన్నారు.

ఈ కాల్పులకు కారణాలు ఇంకా వెల్లడించలేదు. గాయపడిన వారిని తోటి అధికారులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఇంత పెద్ద పార్టీపై నగర ఆంక్షలు ఉన్నప్పటికీ వందలాది మంది హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.

Similar News