వైద్యరంగంలో కరోనా నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చింది: బిల్ గేట్స్

Update: 2020-08-10 20:51 GMT

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను గడగడలాడిస్తుంది. యావత్ ప్రపంచం ఓవైపు కరోనా వ్యాప్తిని అడ్డుకుంటూనే.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా దేశాలు 2021మే నాటికి కరోనా అంతమవుతుందని అన్నారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని.. మహమ్మారి అంతమవుతుందని అన్నారు. 2021 మేనాటికి చాలా దేశాల్లో కరోనా అంతం అవుతుందని.. 2022 చివరి నాటికి మిగిలిన దేశాల్లో కూడా అంతమవుతుందని తెలిపారు. అయితే, కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పట్లో బయటపడలేమని అన్నారు. కాకపోతే, ఈ వైరస్ వైద్యరంగంలో ఎన్నో నూతన ప్రయోగాలకు అవకాశాన్నిచ్చిందని.. నూతన ఆవిస్కరణలను అందుబాటులో తీసుకొచ్చిందని అన్నారు. నూతన చికిత్స విధానాలు, వ్యాక్సిన్‌ పరిశోధనల్లో పురోగతి జరిగిందని బిల్‌ గేట్స్‌ అన్నారు. వైద్యరంగం అభివృద్దికి దోహదపడిందని చెప్పొచ్చిన ఆయన తెలిపారు.

Similar News