భారీగా దిగివచ్చిన బంగారం ధరలు

Update: 2020-08-11 15:16 GMT

డాలర్‌ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోయాయి. దీంతో వరుసగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. గత మూడురోజుల్లో మంగళవారం రెండోసారి భారీగా దిగివచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో పదిగ్రాముల బంగారం 2392 రూపాయలు తగ్గి 52,554 రూపాయలకు చేరితే. కిలో వెండి ఏకంగా 5080 రూపాయలు తగ్గి 70,314 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 200 కు పైగా క్షీణించింది. ఈ క్రమంలో... ధర మాత్రం రూ. 58 వేలపైనే ఉంది. కాగా కోవిడ్‌-19 కేసుల పెరుగుదలతో ఈ ఏడాది బంగారం ధరలు 35 శాతం పెరిగాయి.

Similar News