ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు

Update: 2020-08-10 18:47 GMT

మహారాష్ట్రలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 వరకూ.. లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటిచింది. రోజువారి కరోనా కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా.. కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని.. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పూణే, ముంబై, సోలాపూర్, మాలేగావ్, ఔరంగాబాద్, నాసిక్, ధులే, జల్‌గావ్, అకోలా, అమరావతి, నాగ్‌పూర్‌లలో లాక్‌డౌన్‌ పొడిగించనున్నట్లు ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్ అమల్లో ఉన్నా.. ప్రజల అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు తెరిచే ఉంటాయని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే రెస్టారెంట్లు, సినిమా థియేటర్లకు మాత్రం అనుమతిలేదని ప్రకటించారు.

Similar News