కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజీవ్ త్యాగి మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. కాగా, గత అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్‌లో మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా పనిచేశారు.