వినికిడి సమస్యలకు వాడే ఔషధం.. కరోనా చికిత్సకు

Update: 2020-08-16 12:43 GMT

ప్రస్తుతం పలు రకాల సమస్యలకు వాడుతున్న ఔషధాలు కరోనా చికిత్సలో ఉపయోగపడతాయేమోనని శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వినికిడి సమస్య, మానసిక రుగ్మతలకు ఇంకా అనేక వ్యాధులకు నయం చేయడానికి వాడుతున్న ఒక ఔషధం.. కొవిడ్ చికిత్సకు ఉపయోగపడుతందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అధునాతన కంప్యూటర్ సిమ్యులేషన్లన ఉపయోగించి దీన్ని గుర్తించారు. చికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.

కరోనా వైరస్ జీవిత చక్రంలో కీలక పాత్ర పోషించే ఎంపీఆర్వో అనే ఎంజైమ్ పై వీరు పరిశోధనలు సాగించారు. జన్యుపదార్థమైన ఆర్ఎన్ఏ నుంచి ప్రొటీన్లను తయారు చేసుకునేలా వైరస్ కు ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా మానవ కణంలో వైరస్ సంఖ్య భారీగా పెరిగేలా ఇది చూస్తుంది. వైరస్ లోని ఈ అంశాన్ని లక్ష్యంగా చేసుకునే ఔషధాలను గుర్తించాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం కంప్యూటర్ సిమ్యులేషన్లను ఉపయోగించారు. ఎబ్ సెలన్ అనే ఔషధం.. ఎంపీఆర్వోను లక్ష్యంగా చేసుకోగలదని తేల్చారు. ఈ మందులో యాంటీ వైరల్ లక్షణాలు ఉండడంతో పాటు.. ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేషన్ ను నిలువరించగలదని తేల్చారు.

Similar News