Floods in America: అమెరికాలో దంచికొడుతున్న వానలు.. ఆరుగురు మృతి

Update: 2024-05-18 06:58 GMT

భారీవర్షాలు అమెరికాలోని పలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. హ్యూస్టన్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ సమయంలో వీచిన భారీ ఈదురుగాలులు చిన్నపాటి విధ్వంసాన్ని సృష్టించాయంటున్నారు స్థానికులు.

పెనుగాలులకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు పెద్ద సంఖ్యలో విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి జరిగిన ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి.

భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లు, వ్యాపార కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని.. ఈ సమయంలో భయంకర వాతావరణం కనిపించిందని చెబుతున్నారు స్థానికులు.

Tags:    

Similar News