మరో మూడు వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయని తెలంగాణ రాష్ట్ర వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దక్షిణ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈరోజు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్సాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.