జనం కాదు.. ప్రభంజనం.. టీడీపీ మహానాడు బహిరంగ సభలో జన సునామీ కనబడుతోంది.. నేల ఈనిందా అన్న రీతిలో జనం బహిరంగ సభకు తరలివచ్చారు.. లక్షలాది మంది రాకతో రాజమహేంద్రవరం వేమగిరిలోని సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.. లోపలికి వెళ్లే దారిలేక లక్షలాది మంది జనం బయటే ఉండిపోయారు.. అయితే, రాజమహేంద్రవరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. గాలిదుమారం వచ్చింది.. అయినా తమ్ముళ్లు లెక్కచేయలేదు.. అటు సభా ప్రాంగణం బయట కూడా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ఉండిపోయారు.. గాలిదుమారం వెంటనే భారీ వర్షం స్టార్ట్ అయింది.. భారీ వర్షం పడుతున్నా టీడీపీ కార్యకర్తలు అక్కడే నిలబడి నేతల ప్రసంగాన్ని వింటున్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడుతో రాజమండ్రి పసుపుమయమైంది. వేమగిరిలో బహిరంగ సభా ప్రాంగణం జనసునామీని తలపిస్తోంది. ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తోంది. బహిరంగ సభావేదిక నుంచే టీడీపీ తొలి మ్యానిఫెస్టోను చంద్రబాబు ప్రకటించబోతున్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తొలి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేశారు.