మహానాడు నుండి తిరుగు ప్రయాణమైన తెలుగు తమ్ముళ్లకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా దుగ్గిరాలలో సుమారు 40వేల మంది కార్యకర్తలకు తన ఇంటి వద్ద భోజనాలు పెట్టించారు. జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు ప్రయాణిస్తున్న కార్లను ఆపుతూ విందుకు పిలిచారు. నాన్ వెజ్‌తో పాటు రకరకాల వంటకాలను ఏర్పాటు చేశారు. చింతమనేని ఆతిథ్యాన్ని అందుకున్న టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.