అమిత్ షాతో బాబు మంతనాలు.. కలిసి పోటీచేస్తారట..!

Update: 2023-06-04 07:40 GMT

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి మళ్లీ దగ్గర అయ్యేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వేగంగా లెక్కలు మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. దాదాపు గంటకు పైగా వారు చర్చికున్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. వీరి భేటీతో తెలంగాణ, ఏపీ పాలిటిక్స్‌లో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం మర్యాద పూర్వకంగా కనిపించడం లేదని, జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొనడంతో ఇది కచ్చితంగా రాజకీయ సమావేశంగానే కనిపిస్తోంది. ఇరు పార్టీలకు సంబందించిన లైన్‌ పైనే సమావేశంలో చర్చకు వచ్చినట్లు కనిపిస్తోంది.

మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో.. తెలంగాణలో కూడా బీజేపీ కాస్త స్లో అయిన నేపధ్యంలో దీంతో తెలంగాణలో తమకు టీడీపీ సహకారం అవసరమని,వారితో చేతులు కలిపితే మొత్తం దక్షిణాదిలో పార్టీకి ఊపు తీసుకు రావచ్చన్న అభిప్రాయంలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా బీజేపీ,టీడీపీ తెలంగాణలో కలసి ముందుకు సాగాయి.ఈనేపధ్యంలో తెలంగాణలో టీడీపీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.టీడీపీ 40,50 స్థానాల్లో సంప్రదాయ ఓటింగ్ కలిగి ఉందని అది ఖచ్చితంగా బీజేపీకి ప్లస్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

మరో వైపు ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో పాటు బీజేపీ చేయించిన సర్వేలలో ఏపీలో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని రిపోర్ట్స్‌ వచ్చాయట. దీంతో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సమగ్ర వ్యూహం రూపొందించుకుని రంగంలోకి దిగాలని బీజేపీ నిర్ణయించినట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబుతో వివిధ విషయాలపై అమిత్‌ షా క్లియర్‌గా చర్చించారని సమాచారం. తెలంగాణలో టీడీపీకి స్నేహ హస్తం అందించడంతోపాటు ఏపీలో జగన్‌ విషయంలో పైకి కనిపించిన సానుకూలత తమకేమీ లేదని బీజేపీ అగ్రనేతలు త్వరలోనే సంకేతాలు పంపవచ్చునని భావిస్తున్నారు.

అటు ఏపీలో బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత కూడా వైసీపీ ముక్త్‌ ఏపీ కావాలని గట్టిగానే పోరాడుతున్నారు. ఇటీవలే జగన్‌ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని కాస్తా గట్టిగానే చెప్పినట్లు సమాచారం.ఈ నేపధ్యంలో రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు.. ఇరు వర్గాలు ఆ ప్రయోజనాలను గౌరవిస్తేనే సఖ్యత ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీ ఈ విషయాన్ని గుర్తించినట్లు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే రెండు రాష్ట్రాల్లో పరస్పర సహకారానికి చంద్రబాబు దగ్గర అమిత్‌ షా ప్రతిపాదన చేసినట్లు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Similar News