AP corona cases :ఏపీలో కొత్తగా 1,378 కేసులు.. 10 మరణాలు..!
AP corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 59,566 కొవిడ్ పరీక్షలు చేయగా కొత్తగా 1,378 కేసులు వెలుగు చూశాయి.;
AP Corona Cases
AP corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 59,566 కొవిడ్ పరీక్షలు చేయగా కొత్తగా 1,378 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 20,16,680కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,877కి చేరింది. మరోవైపు 1,139 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారి సంఖ్య 19,88,101కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,702 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,67,45,035 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.