AP Corona Cases : ఏపీలో కొత్తగా 104 మంది మృతి..!
AP Corona Cases : ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,629 టెస్టులు చేయగా 18,767 కేసులు నమోదయ్యాయి;
AP Corona Cases : ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,629 టెస్టులు చేయగా 18,767 కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో 104 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,80,827కి చేరింది. ఇక మరణాల సంఖ్య 10,126కి పెరిగింది. తాజాగా కరోనా నుంచి 20,109మంది కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 13,61,464కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రములో 2,09,237 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.