AP Corona Cases : ఏపీలో కొత్తగా 99 మంది మృతి..!
AP Corona Cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 21,320 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.;
AP Corona Cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 21,320 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,75,372కి చేరింది. కరోనాతో కొత్తగా మరో 99 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 9,580కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 12,54,291 మంది కోలుకుని డిశ్చార్జి అవగా.. 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,81,40,307 శాంపిలను టెస్ట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.