ఏపీలో కొత్తగా 238 కరోనా కేసులు!
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,518 కరోనా టెస్టులు చేయగా, 238 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.;
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,518 కరోనా టెస్టులు చేయగా, 238 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,82,850కి చేరింది. అయితే ఇందులో 3,194 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 279 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోలుకున్న వారి సంఖ్య 8,72,545కి చేరింది. ఇక కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 7111 మంది మృతి చెందారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు 1,19,32,603 కరోనా పరీక్షలు నిర్వహించారు.