AP Corona Cases : ఏపీలో 2,567 కరోనా కేసులు..!
AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 2,567 కేసులు నమోదయ్యాయి.;
AP Corona Cases
AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 2,567 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో మొత్తం 81, 763 శాంపిల్స్ పరీక్షించగా 2,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19, 26,988కి చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 26, 710కి చేరింది. గత 24 గంటల్లో... రాష్ట్రవ్యాప్తంగా 18 మంది కరోనాతో చనిపోయారు. గుంటూరులో నలుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 13,042 మంది కరోనాతో మృతి చెందారు.