Ap Corona Cases : ఏపీలో తగ్గిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 2,620 పాజిటివ్ కేసులు..!
Ap Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. తాజాగా 55,002 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.;
Ap Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. తాజాగా 55,002 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో రాష్ట్రంలో 7వేల 504 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 44 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12వేల 363కి చేరింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 10 మంది కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 18లక్షల 53వేల 183 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17లక్షల 82వేల 680 మంది కోలుకున్నారు. ఇంకా 58వేల 140 మంది చికిత్స పొందుతున్నారు.