Chandrababu Naidu : 3 లక్షల ఇండ్ల గృహప్రవేశం.. చంద్రబాబు సంక్షేమం ఇది..
సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో అందరికీ ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని గతంలోనే చెప్పారు. ఇప్పుడు పదేపదే దాని కోసం తపిస్తున్నారు. కూటమి పాలన అయిపోయేలోపు ఏపీలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండొద్దనేది చంద్రబాబు ఆలోచన. అందుకు తగ్గట్టే వేగంగా పనులు చేస్తున్నారు. ఎంతైనా చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కదా.. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొంత మందికి తాళాలను అప్పగించారు.
రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్‌గా ప్రారంభించారు. నేడు 3 లక్షల ఇండ్ల తాళాలను అప్పగించామని.. రాబోయే ఉగాది నాటికి 5.9లక్షల ఇండ్లకు గృహప్రవేశౄలు చేయిస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇండ్లు రాని వారు బాధపడొద్దని.. మిగతా వారందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత తమదే అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పేదల కోసం ఆలోచిస్తున్నారు కాబట్టే సంక్షేమంలో ఎలాంటి ఢోకా లేకుండా ఏపీని తీర్చిదిద్దుతున్నారు.
ఓ వైపు ఇంటర్నేషనల్ కంపెనీలను ఏపీకి తీసుకొస్తూ ఆదాయంతో పాటు అభివృద్ధిని, ఏపీ యువతకు ఉపాధిని సృష్టిస్తున్నారు. ఇంకోవైపు ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమానికి వినియోగిస్తున్నారు. ఇంతకు మించిన విజనరీ ఏముంటుంది చెప్పండి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. తన బాధ్యతను అనునిత్యం గుర్తు చేసుకుంటూ దాని కోసం పరితపిస్తూనే ఉంటున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలకు ఏపీ ప్రజలు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.