నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శైలే వేరు. ప్రజా సేవ కోసం ఎంతవరకైనా వెళ్తారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవకే ప్రాధాన్యమిస్తారని మరోసారి నిరూపణ అయింది. కేవలం 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి చేశారు. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్, స్థానికుల సమక్షంలో పలు పనులు ప్రారంభించారు. కోటం రెడ్డి అంకిత భావానికి గుర్తుగా సీఎం చంద్రబాబు కోటంరెడ్డికి లేఖ రాశారు. అభివృద్ధి పట్ల MLA తపన ప్రజల్లో ప్రశంసలు పొందుతోంది. రికార్డు స్థాయిలో 339 పనులు పూర్తి చేసిన కోటంరెడ్డిపై ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, లోకేశ్ సహా నెల్లూరు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.