టీవీ5 ఎఫెక్ట్ : త్రాగునీటి సమస్య పరిష్కారం

Update: 2023-05-09 13:34 GMT

టీవీ5 కథనాలకు మన్యం జిల్లా పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ అధికారులు స్పందించారు. సీతంపేట గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. టీవీ5 కథనానికి స్పందించిన సర్పంచ్‌ చిట్టినాయుడు.. పాడైన బోరుకు మరమ్మత్తులు చేపిస్తున్నారు. మరోవైపు త్రాగునీరు సమస్య తీరడంతో టీవీ5కి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.

నెలరోజులుగా సీతంపేటలో ఒక్కబోరు కూడా పనిచేయడం లేదంటూ గిరిజనులు ధర్నా చేపట్టా రు. త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ నిరసన చేపట్టారు. గుక్కెడు నీటి కోసం మహిళలు మూడు కిలోమీటర్లు వెళ్తున్నారంటూ టీవీ5 కథనాలు ప్రసారం చేసింది. మహిళలు కాలీ బిందెలు పట్టుకుని వెళ్తున్న దృశ్యాలను వారి సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించింది. గిరిజనుల సమస్యను అధికారులకు తెలియజేసింది. దీంతో నేరుగా సర్పంచ్‌యే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నారు.

Tags:    

Similar News