Botsa Satyanarayana : బొత్స సత్యనారాయణ పచ్చి అబద్దాలు.. ఆ మాత్రం తెలియదా..

Update: 2026-02-25 04:59 GMT

వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అబద్దాలు పీక్స్ కు వెళ్లిపోతున్నాయి. తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకోడానికి ఎంతటి అబద్దాలు అయినా ఆడుతారని మరోసారి నిరూపించుకున్నారు. కల్తీ నెయ్యి కేసుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సమయంలో.. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇందాపూర్ డెయిరీకి హెరిటేష్ కు లింకులు ఉన్నాయంటూ ఓ కట్టు కథ అల్లారు. చీజ్ కు, నెయ్యికి తేడా తెలియకుండానే మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు. అయితే అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి చిత్ర పటాలను కాళ్లకు షూలు, చెప్పులు వేసుకుని ఎమ్మెల్సీలు పట్టుకోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందూ సమాజం మొత్తం వారి వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. దేవుడంటే భక్తి, నమ్మకం లేదా అంటూ మండిపడ్డారు.

దీన్ని కవర్ చేయడానికి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము చెప్పులు, షూలు వేసుకోలేదని.. కావాలనే తమ ఫొటోలను మార్ఫింగ్ చేశారంటూ కట్టుకథ అల్లేశారు. కానీ లైవ్ లో అనేక ఛానెల్స్ లో కనిపించిన దాన్ని ఎలా మార్ఫింగ్ చేస్తారు. బొత్స సత్యనారాయణకు ఆమాత్రం కూడా తెలియదా. శాసనమండలిని అన్ని ఛానెల్స్ లైవ్ కవరేజీ చేశాయి కదా. వాళ్ల అనుకూల మీడియా ఛానెళ్లలో కూడా వీడియో లైవ్ వచ్చింది కదా. మరి అది కూడా మార్పింగ్ అంటారా బొత్స సత్యనారాయణ.

అంటే జనాలు నవ్వుతారు అనే కనీస ఆలోచన లేకుండానే ఇలా మాట్లాడుతున్నారా. గతంలో బొత్స సత్యనారాయణకు ఎంతో కొంత మంచి పేరు ఉండేది. కానీ ఈ మధ్య మితిమీరిన అబద్దాలతో ఆయన ఇమేజ్ మొత్తం తీసేసుకుంటున్నారు. తమ మీద వస్తున్న అలిగేషన్స్ నుంచి తప్పించుకోలేక కూటమి మీద బురద జల్లేందుకు ప్రయత్నించి చివరకు వాళ్లే అబాసుపాలవుతున్నారు. కాబట్టి బొత్స సత్యనారాయణ ఇలాంటి అబద్దాలు మానేసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే బాగుంటుంది అంటున్నారు కూటమి నేతలు.

Tags:    

Similar News