AP corona cases : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!
AP corona cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపుగా ఎనమిది వేల కేసులు నమోదయ్యాయి.;
AP corona cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపుగా ఎనమిది వేల కేసులు నమోదయ్యాయి. 83,461 కరోనా పరీక్షలు చేయగా 7,943మంది కరోనా బారిన పడ్డారు. దీనితో తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,93,085కి చేరుకుంది. మరోవైపు కరోనాతో పోరాడుతూ మరో 15 మంది మృతి చెందారు. పశ్చిమగోదావరి 12, ప్రకాశం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 7, కృష్ణా 6, కర్నూలు 6, విజయనగరం 6, గుంటూరు 4, నెల్లూరు 4, కడపలో ముగ్గురు మృతి చెందారు, దీనితో మృతుల సంఖ్య 10,930కి పెరిగింది. అటు 19,845మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులున్నాయి.