ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 27, 861 కరోనా టెస్టులు చేయగా, 81 కరోనా కేసులు నమోదయ్యాయి;
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 27, 861 కరోనా టెస్టులు చేయగా, 81 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 8,86,066కు చేరుకుంది. ఇందులో 1,173 యాక్టివ్ కేసులుండగా, 8,77,212 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా కరోనా వలన విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీనితో రాష్ట్రంలో మరణాల సంఖ్య 7,141కి చేరింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 1,26,04,214 కరోనా టెస్టులను నిర్వహించింది ప్రభుత్వం.