పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలకు షాకిచ్చిన మహిళ
ఉండి మండలం ఉప్పలూరు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాస్త ఓవర్ యాక్షన్ చేశారు.;
పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకులకు ఓ మహిళ సడన్ షాక్ ఇచ్చింది. ఉండి మండలం ఉప్పలూరు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. లబ్ధిదారులకు కూడా వైసీపీ కండువాలు కప్పి హడావుడి చేశారు. అయితే పట్టా తీసుకున్న ఓ మహిళ... ఇళ్ల స్థలం ఇచ్చినందుకు జగన్‌కు కృతజ్ఞతలు చెప్పబోతూ.. చంద్రబాబు పేరు పలికింది. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ మహిళ వెంటనే పేరు సవరించుకున్నా... సభకు హాజరైన వారు మాత్రం దీనిపై గుసగుసలాడుకున్నారు.