AMARAVATHI: ప్రపంచస్థాయి క్వాంటమ్ హబ్ దిశగా కీలక ముందడుగు

దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్ వేర్ టెస్ట్ బెడ్ లు.. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో ఏర్పాటు.. ఈనెల 14న ఆరంభించనున్న సీఎం చంద్రబాబు

Update: 2026-04-09 03:15 GMT

అమ­రా­వ­తి­ని ప్ర­పంచ స్థా­యి క్వాం­ట­మ్‌ టె­క్నా­ల­జీ కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్దా­ల­న్న లక్ష్యం­తో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­భు­త్వం వే­గం­గా అడు­గు­లు వే­స్తోం­ది. ఈ ది­శ­గా కీ­ల­క­మైన ముం­ద­డు­గు­గా దే­శం­లో­నే తొలి క్వాం­ట­మ్‌ హా­ర్డ్‌­వే­ర్‌ టె­స్ట్‌­బె­డ్‌­లు అమ­రా­వ­తి­లో ఏర్పా­టు అవు­తు­న్నా­యి. ఈ ప్రా­జె­క్ట్‌ ద్వా­రా అమ­రా­వ­తి “క్వాం­ట­మ్‌ వ్యా­లీ”గా రూ­పు­ది­ద్దు­కు­నే ది­శ­లో ప్ర­యా­ణం ప్రా­రం­భ­మైం­ద­ని చె­ప్పా­లి. ప్ర­పంచ క్వాం­ట­మ్‌ ది­నో­త్స­వా­న్ని పు­ర­స్క­రిం­చు­కు­ని ఈ నెల 14న ఈ సదు­పా­యా­ల­ను అధి­కా­రి­కం­గా ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. అమ­రా­వ­తి­లో­ని ఎస్‌­ఆ­ర్‌­ఎం యూ­ని­వ­ర్సి­టీ­తో పాటు వి­జ­య­వా­డ­లో­ని మే­ధా­ట­వ­ర్స్‌­లో ఈ టె­స్ట్‌­బె­డ్‌­లు ఏర్పా­టు చే­య­డం ప్ర­త్యే­కత. వీ­టి­ని “భా­ర­త్‌ క్వాం­ట­మ్‌ రి­ఫ­రె­న్స్‌ ఫె­సి­లి­టీ­స్‌”గా అభి­వ­ర్ణి­స్తు­న్నా­రు. దే­శీయ సాం­కే­తిక పరి­జ్ఞా­నం­తో అభి­వృ­ద్ధి చే­సిన చి­న్న పరి­మా­ణం గల రెం­డు క్వాం­ట­మ్‌ కం­ప్యూ­ట­ర్లు ఇక్కడ ఏర్పా­టు చే­య­బ­డు­తు­న్నా­యి.

క్వాం­ట­మ్‌ రం­గం­లో అను­భ­వం ఉన్న దే­శీయ, అం­త­ర్జా­తీయ ని­పు­ణు­లు కలి­సి స్థా­పిం­చిన స్టా­ర్ట­ప్‌ సం­స్థ క్యూ­బి­ట్‌ ఫో­ర్స్‌ ఈ కం­ప్యూ­ట­ర్ల రూ­ప­క­ల్ప­న­లో కీలక పా­త్ర పో­షిం­చిం­ది. ఎస్‌­ఆ­ర్‌­ఎం­లో “అమ­రా­వ­తి 1ఎస్‌” పే­రు­తో ఒక కం­ప్యూ­ట­ర్‌­ను ఏర్పా­టు చే­స్తుం­డ­గా, మరో కం­ప్యూ­ట­ర్‌­ను “అమ­రా­వ­తి 1క్యూ” పే­రు­తో మే­ధా­ట­వ­ర్స్‌­లో అమలు చే­స్తు­న్నా­రు. ఈ రెం­డు ప్రా­జె­క్టు­లు కే­వ­లం ఎని­మి­ది నెలల వ్య­వ­ధి­లో పూ­ర్తి కా­వ­డం వి­శే­షం. ఈ ప్రా­జె­క్ట్‌­లో భా­గం­గా ఉప­యో­గిం­చిన హా­ర్డ్‌­వే­ర్‌ పరి­క­రా­ల­ను దే­శం­లో­ని ప్ర­ముఖ శా­స్త్ర­సాం­కే­తిక సం­స్థ­లు, రక్షణ రంగ సం­స్థ­లు, ప్రై­వే­టు కం­పె­నీ­లు కలి­సి తయా­రు చే­శా­యి. టీ­ఐ­ఎ­ఫ్‌­ఆ­ర్‌ ముం­బ­యి, ఐఐ­ఎ­స్‌­సీ బెం­గ­ళూ­రు వంటి ప్ర­ముఖ వి­ద్యా­సం­స్థ­లు క్వాం­ట­మ్‌ ప్రా­సె­స­ర్‌ల అభి­వృ­ద్ధి­లో భా­గ­స్వా­మ్య­మ­య్యా­యి. డీ­ఆ­ర్‌­డీఓ ల్యా­బ్‌­లు కం­ట్రో­ల్‌ ఎల­క్ట్రా­ని­క్స్‌­ను అం­దిం­చ­గా, మరి­కొ­న్ని సం­స్థ­లు క్ర­యో­జె­ని­క్‌ ఎల­క్ట్రా­ని­క్‌ భా­గా­ల­ను సమ­కూ­ర్చా­యి.

ఈ రి­ఫ­రె­న్స్‌ ఫె­సి­లి­టీల ప్ర­ధాన లక్ష్యం కే­వ­లం పరి­శో­ధ­న­కే పరి­మి­తం కా­కుం­డా, క్వాం­ట­మ్‌ హా­ర్డ్‌­వే­ర్‌ తయా­రీ­కి బల­మైన వే­ది­క­ను అం­దిం­చ­డం. ఇప్ప­టి­వ­ర­కు భా­ర­త­దే­శం­లో తయా­రైన క్వాం­ట­మ్‌ పరి­క­రా­ల­ను పరీ­క్షిం­చ­డా­ని­కి వి­దే­శా­ల­కు పం­పా­ల్సి వచ్చే­ది. ఆ ప్ర­క్రి­య­కు నెలల సమయం పట్టే­ది. కొ­న్ని దే­శా­లు ఈ పరీ­క్ష­ల­కు అను­మ­తి కూడా ఇవ్వ­క­పో­వ­డం వల్ల పరి­శో­ధ­న­కు ఆటం­కం ఏర్ప­డే­ది. ఇప్పు­డు అమ­రా­వ­తి­లో ఈ సదు­పా­యా­లు అం­దు­బా­టు­లో­కి రా­వ­డం­తో దే­శీయ సం­స్థ­ల­కు పె­ద్ద ఊర­ట­ని­స్తుం­ది. ఈ కేం­ద్రా­లు పరి­శో­ధ­కు­లు, స్టా­ర్ట­ప్‌­లు, పరి­శ్ర­మ­లు, వి­ద్యా­సం­స్థ­లు, వి­ద్యా­ర్థు­లం­ద­రి­కీ అం­దు­బా­టు­లో ఉం­డ­టం మరో ము­ఖ్యాం­శం. ఇప్ప­టి వరకు పు­స్త­కా­ల­లో మా­త్ర­మే చది­విన క్వాం­ట­మ్‌ టె­క్నా­ల­జీ­ని వి­ద్యా­ర్థు­లు ప్ర­త్య­క్షం­గా అను­భ­విం­చే అవ­కా­శం లభి­స్తుం­ది. 111 క్యూ­బి­ట్స్‌ వరకు ఉన్న ప్రా­సె­స­ర్‌­ల­ను పరీ­క్షిం­చ­గల సా­మ­ర్థ్యం ఈ సదు­పా­యా­ల­కు ఉంది. భవి­ష్య­త్తు­లో దీ­ని­ని మి­లి­య­న్‌ క్యూ­బి­ట్స్‌ స్థా­యి­కి పెం­చే లక్ష్యం­తో ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం చే­స్తు­న్నా­రు. క్వాంటమ్‌ కంప్యూటర్లలో కీలక పాత్ర పోషించే క్రయోజెనిక్‌ డైల్యూషన్‌ రిఫ్రిజిరేటర్ల తయారీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది. క్వాంటమ్‌ కంప్యూటర్లు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే పని చేస్తాయి. అందుకే -270 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతను తగ్గించే ప్రత్యేక సాంకేతికత అవసరం. ఈ అవసరాన్ని తీర్చే విధంగా దేశీయంగా ఈ పరికరాలను అభివృద్ధి చేయడం ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు.

ఈ సదుపాయాలు కేవలం క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కే కాకుండా రక్షణ, ఆరోగ్య, అంతరిక్ష, సెమీకండక్టర్‌ తయారీ వంటి రంగాలకు కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. క్రయోజెనిక్‌ సిస్టమ్స్‌ ఎంఆర్‌ఐ యంత్రాల్లో, అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగపడతాయి. ప్రెసిషన్‌ ఎలక్ట్రానిక్స్‌ రాడార్‌, డిఫెన్స్‌ సెన్సింగ్‌ వ్యవస్థలకు దోహదపడుతుంది. మొత్తంగా చూస్తే, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ దేశానికి ఒక మైలురాయిగా నిలవనున్నాయి. క్వాంటమ్‌ టెక్నాలజీలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే స్థాయికి చేరుకునే మార్గాన్ని ఇవి సుగమం చేస్తాయని చెప్పాలి.

Tags:    

Similar News