YS Jagan : పనిచేయని 'మావిగన్' ప్లాన్.. డైలమాలో వైసీపీ..!

Update: 2026-04-08 12:15 GMT

వైసీపీ నేతలపై నమోదవుతున్న అక్రమాస్తుల కేసులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కొక్కటిగా వైసీపీ నేతల అవినీతి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. వీటిని కవర్ చేయడానికి జగన్ ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నా వర్కౌట్ కావట్లేదు. బెంగుళూరు ప్యాలెస్ లో ఏదో ఒక ప్లాన్ రెడీ చేసుకుని ఏపీకి వచ్చి మీడియా ముందు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. కానీ చివరకు ట్రోల్స్ పాలవుతున్నారు. మొన్న మావిగన్ అంటూ ఏదో పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చామనుకున్నారు. ఆ దెబ్బకు తమ అవినీతి అక్రమాల నుంచి ప్రజల దృష్టి డైవర్ట్ అవుతుందని.. తమ ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది. మావిగన్ పై పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి.

చివరకు వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ ప్రతిపాదనను స్వాగతించలేదు. దీంతో వైసీపీ నేతలు డైలమాలో పడ్డారు. జగన్ ఏం చేసినా చివరకు అది తమకే గుచ్చుకుంటోందని వారు వాపోతున్నారు. ఇప్పుడు ప్రజలు తమ అవినీతి గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప మావిగన్ గురించి మర్చిపోయారని వైసీపీ నేతలు జగన్ వద్ద ప్రతిపాదనలు పెడుతున్నారంట. ఇలా పసలేని ప్లాన్లు, స్క్రిప్టులు రాసుకోవద్దని.. కొంచెం ఆలోచించి స్క్రిప్టు రాసుకోవాలని చెబుతున్నారంట.

కానీ జగన్ మాత్రం ప్రతిసారి ఇలాగే అట్టర్ ప్లాప్ అవుతూ వస్తున్నారు. ఇలాంటి ప్లాన్లు సక్సెస్ కావని జగన్ కు ఎన్ని చెబుతున్నా సరే ఆయన తన పట్టు వీడకుండా మళ్లీ మళ్లీ ప్రజల ముందు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి మావిగన్ అనే స్క్రిప్టు చెత్తబుట్టలోకి చేరిందనే చెప్పుకోవాలి. మరి జగన్ మరోసారి ఎలాంటి పసలేని ప్లాన్లు వేసుకుని వస్తారనేది చూడాలి. ఆ స్క్రిప్టు కూడా ఇలాగే ఉంటే.. ఇక జగన్ ను సొంత పార్టీ నేతలు కూడా సీరియస్ గా తీసుకోరేమో.

Tags:    

Similar News