AMARAVATHI: అమరావతి క్వాంటం వ్యాలీ: 2030 నాటికి ప్రపంచ టాప్-5

సాంకేతిక విప్లవం దిశగా అమరావతి

Update: 2026-04-08 09:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రా­న్ని అత్యా­ధు­నిక సాం­కే­తిక పరి­జ్ఞా­నా­ని­కి చి­రు­నా­మా­గా మా­ర్చే ది­శ­గా రా­ష్ట్ర ప్ర­భు­త్వం మరో కీలక అడు­గు వే­సిం­ది. 2030 నా­టి­కి ప్ర­పం­చం­లో­ని టాప్-5 క్వాం­టం కం­ప్యూ­టిం­గ్ హబ్‌­ల­లో ఒక­టి­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను ని­ల­ప­డ­మే లక్ష్యం­గా అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ కా­ర్యా­చ­ర­ణ­ను ఖరా­రు చే­సిం­ది. అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ­లో 3 సం­స్థల ఏర్పా­టు­కు ఎస్ఐ­పీ­బీ గ్రీ­న్ సి­గ్న­ల్​ ఇచ్చిం­ది. సౌర వి­ద్యు­త్ ఉత్ప­త్తి కేం­ద్రం­గా రా­య­ల­సీ­మ­ను తీ­ర్చి­ది­ద్దా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు. భవి­ష్య­త్ అవ­స­రా­ల­కు అను­గు­ణం­గా ట్రా­న్స్‌­మి­ష­న్ లై­న్స్ ఉం­డా­ల­ని సూ­చిం­చా­రు. ప్ర­స్తు­తం రా­ష్ట్రం­లో 325 గి­గా­వా­ట్ల సౌ­ర­వి­ద్యు­త్ ఉత్ప­త్తి­కి అవ­కా­శం ఉం­ద­ని అధి­కా­రు­లు ము­ఖ్య­మం­త్రి­కి వి­వ­రిం­చా­రు. ఉత్ప­త్తి అయిన వి­ద్యు­త్​­ను స్టే­ట్​ గ్రి­డ్, సెం­ట్ర­ల్ గ్రి­డ్​­కు కనె­క్ట్​ చే­సే­లా చూ­డా­ల­ని మం­త్రి లో­కే­శ్​ సూ­చిం­చా­రు. ప్ర­స్తు­తం రా­జ­స్థా­న్​­లో సౌర వి­ద్యు­త్ ఉత్ప­త్తి జరు­గు­తు­న్నా పూ­ర్తి స్థా­యి­లో వి­ని­యో­గిం­చు­కో­లే­ని పరి­స్థి­తి ఉం­ద­ని, అలాం­టి పరి­స్థి­తి తలె­త్త­కుం­డా ప్ర­త్యా­మ్నాయ మా­ర్గా­ల­ను ఏర్పా­టు చే­సు­కో­వా­ల­ని సీఎం ది­శా­ని­ర్దే­శం చే­శా­రు.

సాంకేతిక విప్లవం దిశగా...

భారతదేశం సాంకేతిక విప్లవం దిశగా మరో కీలక మలుపు తిరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రబిందువుగా మారుతోంది. ఒకప్పుడు పచ్చని వ్యవసాయ భూములతో విస్తరించి ఉన్న తుళ్లూరు ప్రాంతం ఇప్పుడు భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి నిలయంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచం నేడు ఐటీ యుగాన్ని దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల వైపు పయనిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో ఏర్పాటు కానున్న “క్వాంటం వ్యాలీ” కేవలం ఒక టెక్నాలజీ ప్రాజెక్టు మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తు సాంకేతిక సామర్థ్యాలను మలిచే కేంద్రంగా అవతరించే అవకాశాన్ని కలిగి ఉంది. దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో మరింత బలంగా నిలబెట్టే దిశగా ఈ ప్రాజెక్టు ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే అభిప్రాయం టెక్నాలజీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొనడం ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేసింది. కేంద్రం మరియు రాష్ట్రం కలిసి భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలిచింది. భారతదేశం కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఎదగాలని భావిస్తున్న నేపథ్యంలో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రారంభం ఒక చారిత్రాత్మక అడుగుగా చెప్పుకోవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటర్లకు పూర్తిగా భిన్నమైన సాంకేతికత. సంప్రదాయ కంప్యూటర్లు బిట్‌ల ఆధారంగా పని చేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్యుబిట్‌ల ఆధారంగా పని చేస్తాయి. ఈ సాంకేతికత వల్ల క్లిష్టమైన సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఏర్పడుతుంది.

ఈ ప్రా­జె­క్టు­లో ప్ర­పం­చ­స్థా­యి టె­క్నా­ల­జీ సం­స్థ­లు భా­గ­స్వా­మ్యం కా­వ­డం మరింత ప్రా­ధా­న్య­త­ను తీ­సు­కు­వ­చ్చిం­ది. IBM, TCS, L&T వంటి ది­గ్గజ సం­స్థ­లు అమ­రా­వ­తి క్వాం­టం వ్యా­లీ ఏర్పా­టు­లో కీలక పా­త్ర పో­షిం­చ­ను­న్నా­యి. IBM మరి­యు TCS కలి­సి ఇక్కడ ప్ర­త్యే­కం­గా క్వాం­టం ఇన్నో­వే­ష­న్ సెం­ట­ర్‌­ను ఏర్పా­టు చే­య­ను­న్నా­రు.క్వాం­టం కం­ప్యూ­టిం­గ్ అల్గా­రి­థ­మ్స్, అప్లి­కే­ష­న్లు మరి­యు కొ­త్త సాం­కే­తిక పరి­జ్ఞా­నా­ల­పై పరి­శో­ధ­న­లు జర­గ­ను­న్నా­యి. దే­శం­లో­నే కా­కుం­డా ఆసి­యా ప్రాం­తం­లో ప్ర­ముఖ పరి­శో­ధ­నా కేం­ద్రం­గా ఎది­గే అవ­కా­శం ఉంది.

Tags:    

Similar News