షాకింగ్ వీడియో..కొండపై నుంచి కింద పడి పూజారి మృతి
Priest Died: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుంది. శింగనమల మండలలో ప్రసిద్ధ దేవస్థానం శ్రీగంపమల్లయ్య స్వామి ఆలయ పూజారి..;
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుంది. శింగనమల మండలలో ప్రసిద్ధ దేవస్థానం శ్రీగంపమల్లయ్య స్వామి ఆలయ పూజారి.. స్వామివారికి పూజలు చేస్తుండగా... సుమారు వంద అడుగుల కొండపై నుంచి కాలు జారి లోయలో పడ్డారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దేవుడికి పూజలు నిర్వహిస్తున్న సమయంలో పూజారి అప్పా పాపయ్య లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భక్తులు తీవ్రంగా కలత చెందారు..