AP: ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురి మృతి

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2026-01-22 02:30 GMT

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు టైరు పేలి డివైడర్‌ మీదుగా వెళ్లి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి దగ్ధమైంది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న డీసీఎం డ్రైవర్ బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను రక్షించాడు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ డీసీఎం డ్రైవర్ వెంటనే బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కిటికీల్లోంచి దూకేయడంతో పదిమందికిపైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. వీరిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు టైరు పేలటంతో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అర్థరాత్రి.. ట్రాఫిక్ లేకపోవటం, అటుగా వెళ్తున్న డీసీఎం డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు, లారీ డ్రైవర్లు, క్లీనర్ మృతదేహాలు గుర్తి పట్ని విధంగా కాలిపోయాయి.

Tags:    

Similar News