అమరావతిలో ఆగిన మరో మహిళా రైతు గుండె
రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మహిళా రైతు చనిపోయింది.;
అమరావతిలో మరో మహిళా రైతు గుండె ఆగింది. మందడం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళా రైతు గుండెపోటుతో చనిపోయింది. శాంతకుమారి అనే మహిళా రైతు ప్రతిరోజూ మందడం శిబిరంలో జరిగే ఆందోళనల్లో పాల్గొనేది. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండెపోటు వచ్చి చనిపోయింది. మహిళా రైతు శాంత కుమారి వయస్సు 44 సంవత్సరాలు.