AP Assembly : జగన్ కు ఝలక్.. ఇక నుంచైనా అసెంబ్లీకి వస్తారా..?

Update: 2026-02-11 08:45 GMT

మాజీ సీఎం జగన్ కు ఝలక్ తగిలింది. అసెంబ్లీకి రాకుండా చట్టాలను, ఓటు వేసిన ప్రజలను అవమానిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పేలా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదో చుట్టపు చూపులా అసెంబ్లీకి ఆరు నెలలకు ఒకసారి వచ్చి రిజిస్టర్ లో సంతకాలు చేస్తూ జగన్ బ్యాచ్ తప్పించుకుంటోంది. కానీ ఇక నుంచి రిజిస్టర్ లో సంతకాల విధానాన్ని తీసేసి.. డిజిటల్ అటెండెన్స్ ను తీసుకొచ్చకారు స్పీకర్. అంటే ఇక నుంచి కచ్చితంగా అసెంబ్లీకి ప్రతిరోజూ వచ్చి చర్చిస్తేనే అటెండెన్స్ కింద పరిగణిస్తారు. అంతే తప్ప రిజిస్టర్ లో సంతకం పెట్టేసి వెళ్లిపోతామంటే కుదరదు. ఇది జగన్ కు అస్సలు నచ్చని పనే అని చెప్పాలి. ఎందుకంటే జగన్ గొంతెమ్మ కోరికలతో ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుండా గడిపేస్తున్నారు.

కానీ అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ, అన్ని రకాల సౌకర్యాలను మాత్రం అనుభవిస్తున్నారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకే కదా ప్రజలు ఓటేసింది. మరి వాళ్ల ఓటుకు ఇన్ని రోజులు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలాంటి గౌరవం ఇచ్చారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా అవమానించినా సరే ప్రజల తరఫున మాట్లాడారు కదా. అసెంబ్లీకి వచ్చి ప్రజల ఓటును గౌరవించారు కదా. జగన్ అండ్ బ్యాచ్ ఎంత తిట్టాలో.. ఎంత అవమానించాలో అంత చేసేశారు.

కానీ ఏనాడూ చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా ఉండలేదు. కానీ చివరకు అత్యంత దారుణంగా సీఎం చంద్రబాబు సతీమణిని అవమానిస్తే.. తట్టుకోలేక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ వారి మెప్పు పొందారు. మరి ఇప్పుడు జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలకు అవమానం జరగనివ్వబోం.. అందరినీ సమానంగా గౌరవిస్తాం అని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా సరే జగన్ వినట్లేదు. మరి ఇప్పుడు డిజిటల్ అటెండెన్స్ వచ్చింది. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇక నుంచైనా జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా రాకుండా సభను అవమానిస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News