andhrapradesh: నేడు ప్రభుత్వ ఉద్యోగుల నిరాహార దీక్ష
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. ఇవాళ నిరాహార దీక్షలు చేయనున్నారు;
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. ఇవాళ నిరాహార దీక్షలు చేయనున్నారు. ఇక నిన్నసీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు . మరోమారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీఎస్‌కు అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావు కలిసి 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎస్‌కు అందించారు. తాము తలపెట్టిన దశలవారీ ఆందోళనల వివరాలను సీఎస్‌కు వివరించారు. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీఎస్‌కు తెలిపారు.