sit: లడ్డూ వివాదంపై నిజాలు నిగ్గు తేల్చేది ఈ ముగ్గురే
సిట్‌కు చీఫ్‌గా సర్వశ్రేష్ట త్రిపాఠి.... సిట్‌లో సభ్యులుగా గోపినాథ్ శెట్టి, హర్షవర్దన్ రాజు;
తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు చీఫ్‌గా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమించింది. త్రిపాఠి ప్రస్తుతం గుంటూరు రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. సిట్‌లో సభ్యులుగా గోపినాథ్ శెట్టి, హర్షవర్దన్ రాజును నియమించింది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని.. దోషులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ సిట్ టీమ్‌లో మరి కొంతమంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను ఏపీ ప్రభుత్వం నియమించనుంది.
తీవ్రమవుతున్న సిట్ వివాదం
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ఘోర అపచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. సోమవారం శాంతి హోమం నిర్వహించింది. అనంతరం శ్రీవారు కొలువు దీరిన ఆనంద నిలయంతోపాటు తిరుమాడ వీధుల్లో తిరుమల పూజారులు సంప్రోక్షణ నిర్వహించారు. వెంకన్న భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజుకున్న వివాదం రోజు రోజుకు పెద్దదిగా మారుతోంది. ఈవిషయంలో గత పాలకులు చేసింది అపచారం అని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంటే కాదు తాము ప్రసాదం తయారికి అవసరమయ్యే ప్రాసెస్ ను పకడ్బందీగా అమలు చేశామని వైసీపీ అధ్యక్షుడు జగన్ వివరణ ఇచ్చారు. అయితే లడ్డూ తయారిలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందనేది ప్రస్తుతం వివాదంగా మారింది. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లడ్డూ ప్రసాదం వివాదంపై ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే ఓ ఐజీ అధికారిని నియమించింది. సిట్ సభ్యులుగా గోపినాథ్ జెట్టి, హర్షవర్దన్ రాజును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సిట్ చీఫ్‌గా నియమించిన సర్వశ్రేష్ట త్రిపాఠి ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు.
నేతల మండిపాటు
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై తెలంగాణ నేతలు కూడా మండిపడుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన నెయ్యిని తక్కువ ధరకు కొనడం వల్లే కల్తీ జరిగిందని ఆరోపించారు. ఈవిషయంలో అప్పటి సీఎం జగన్ రివర్స్ టెండర్ విధానం పేరుతో చేపట్టిన ఘనకార్యమేనని నారాయణ చురకలు అంటించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సైతం ఇదే అంశంపై స్పందించారు. ఈ లడ్డూ తయారిలో జరిగిన కల్తీపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. మాజీ సీఎం జగన్ కూడా అదే డిమాండ్ చేయాలని ఆయన సూచించారు. అప్పుడే నిజాలు నిగ్గుతేలతాయన్నారు. దేవుని ప్రసాదం కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.