పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌పై ఎన్నికల సంఘం అభిశంసన

రూల్స్‌ ప్రకారం పనిచేసే అధికారులు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో మరోసారి నిరూపించారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.

Update: 2021-01-26 07:48 GMT

ఏపీ పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్విదేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ను అభిశంసన చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. 2021 ఓటర్ల జాబితా ప్రచురణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇద్దరూ విధులు నిర్వహించడానికి అనర్హులని పేర్కొంది ఎస్‌ఈసీ. వీరిద్దరిని తొలగించాలని ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.

ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కోర్టుకు చెప్పి కూడా ఆ విధి నిర్వహించలేదని అందుకే వీరిపై అభిశంసన చేస్తున్టన్లు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ప్రొసీడింగ్స్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌ వల్ల జరిగిన ఈ తొలగింపును.. ఈ ఇద్దరు అధికారుల సర్వీస్‌ రికార్డుల్లో నమోదు చేయాలని తన ఆదేశాల్లనూ పేర్కొన్నారు ఎస్‌ఈసీ. దీంతో.. వీరిద్దరి సర్వీస్‌ రికార్డులో బ్లాక్‌ మార్క్‌ పడింది.

విధి నిర్వహణలో ఎన్ని అడ్డంకులొచ్చినా డోన్ట్‌కేర్ అన్నారు నిమ్మగడ్డ. నిష్పాక్షికంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంతో నిమ్మగడ్డ అడుగులు వేశారు. జగన్‌ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న నిమ్మగడ్డ.. నాడు TN శేషన్ తరహాలోనే పనిచేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ జరిగిన ప్రతిసారీ న్యాయపోరాటం చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ఆచితూచి వ్యవహరిస్తూ రాజ్యాంగ బద్దంగా.. పని చేశారు. ఎవరికీ భయపడకుండా పనిచేస్తోన్న నిమ్మగడ్డను చూసి నేర్చుకోవాలంటూ.. పలువురు IASలకు పరోక్షంగా సూచనలు చేస్తున్నారు రాజ్యాంగ నిపుణులు. నిబంధనల ప్రకారం పనిచేస్తే ఎంత పవర్ ఉంటుందో చూపించారు నిమ్మగడ్డ. రూల్స్‌ ప్రకారం పనిచేసే అధికారులు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో మరోసారి నిరూపించారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.


Tags:    

Similar News