Medical Students Dress Code: వైద్య విద్యార్ధులకు డ్రెస్ కోడ్.. ఇకపై జీన్స్, టీ షర్ట్..

Medical Students Dress Code: వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించకూడదని రాష్ట్ర వైద్య విద్య అధికారులు స్పష్టం చేశారు.

Update: 2022-12-02 06:22 GMT

Medical Students Dress Code: వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించకూడదని రాష్ట్ర వైద్య విద్య అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ కార్యాలయం.. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలని తెలిపింది. డీఎంఈ కార్యాలయంలో ఏర్పటు చేసిన అధికారుల సమావేశంలో వైద్య విద్యార్థుల డ్రెస్ కోడ్‌ను ప్రస్తావించింది.


ఎంబీబీఎస్, పీజీ చదువుతున్న విద్యార్థులు శుభ్రంగా ఉన్న దుస్తులు ధరించాలి. షేవ్ చేసుకోవాలి. మహిళలు జుట్టు వదిలేయకూడదు. తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలి. గతంలో నిర్ధేశించిన డ్రెస్ కోడ్‌ను విద్యార్థులు అమలు పరచకపోవడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.


వైద్య కళాశాలలకు వచ్చే రోగులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవాల్సి వస్తే.. సహాయకులు లేరని తిరస్కరించవద్దని తెలిపింది. ఫేస్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్ మెడికల్ కాలేజీల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు.

Tags:    

Similar News