AP: కేంద్ర బడ్జెట్‌లో.. ఏపీ వాటా ఎంతంటే..?

బడ్జెట్ ఏపీకి ఊతమిచ్చేలా ఉందన్న కూటమి

Update: 2026-02-02 05:00 GMT

2026-27 బడ్జె­ట్‌­లో ఏపీ­కి పలు కీలక కే­టా­యిం­పు­లు లభిం­చా­యి. మై­నిం­గ్ అభి­వృ­ద్ధి­కి రేర్ ఎర్త్ కా­రి­డా­ర్, పు­లి­కా­ట్ సర­స్సు పరి­ర­క్ష­ణ­కు ప్ర­త్యేక ని­ధు­లు ప్ర­క­టిం­చా­రు. రా­ష్ట్రం­లో కె­మి­క­ల్ పా­ర్కు­లు, కొ­బ్బ­రి, జీ­డి­ప­ప్పు వంటి పం­ట­ల­కు ప్రో­త్సా­హ­కా­లు అం­ద­ను­న్నా­యి. అమ­రా­వ­తి, పో­ల­వ­రం ప్రా­జె­క్టు­ల­కు గతం­లో ప్ర­క­టిం­చిన ఆర్థిక సాయం కొ­న­సా­గ­నుం­ది. 16వ ఆర్థిక సంఘం గ్రాం­ట్ల ద్వా­రా ఏపీ­కి గణ­నీ­య­మైన వాటా లభిం­చ­నుం­ది. రేర్ ఎర్త్ కారిడార్ ఏపీ గేమ్ ఛేంజర్ గా మారనుందన్న అంచనాలు ఉన్నాయి.

అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ

ఏపీ రా­జ­ధా­ని అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి­కి కేం­ద్ర ప్ర­భు­త్వం 2026 బడ్జె­ట్‌­లో సు­మా­రు రూ.1,128.91 కో­ట్ల­ని ప్రా­థ­మి­కం­గా కే­టా­యిం­చిం­ది. రా­జ­ధా­ని ని­ర్మా­ణం నుం­చి సా­గు­నీ­టి ప్రా­జె­క్టు­లు, ప్రాం­తీయ అస­మా­న­తల తొ­ల­గిం­పు నుం­చి పరి­శ్ర­మల అభి­వృ­ద్ధి వరకు—ప్ర­తి రం­గం­లో­నూ రా­ష్ట్రా­ని­కి భారీ పె­ట్టు­బ­డు­లు అవ­స­ర­మ­వు­తు­న్నా­యి. అభి­వృ­ద్ధి వేగం పెం­చా­లం­టే కేం­ద్ర ప్ర­భు­త్వ సహ­కా­రం తప్ప­ని­స­రి అనే స్థా­యి­కి పరి­స్థి­తి చే­రు­కుం­ది. ఈ నే­ప­థ్యం­లో 2026–27 కేం­ద్ర బడ్జె­ట్‌­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ అవ­స­రా­ల­కు తగిన ప్రా­ధా­న్యం కల్పిం­చా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం స్ప­ష్ట­మైన డి­మాం­డ్ల­తో కేం­ద్రా­న్ని ఆశ్ర­యిం­చిం­ది. కేం­ద్ర ప్ర­భు­త్వం పలు వి­భా­గాల ద్వా­రా ఏపీ­లో­ని ప్ర­ముఖ ప్రై­వే­టు, ప్ర­భు­త్వ వి­ద్యా సం­స్థ­ల­కు పరి­శో­ధ­నా గ్రాం­ట్ల­ను ప్ర­క­టిం­చిం­ది. అం­త­రి­క్ష పరి­శో­ధ­న­లు, సాం­కే­తి­కత అభి­వృ­ద్ధి కోసం ఈ క్రిం­ది సం­స్థ­ల­ని కేం­ద్ర ప్ర­భు­త్వం 2026 బడ్జె­ట్‌­లో ఎం­పిక చే­సిం­ది.

 ఐబీఆర్‌డీ (IBRD) నిధుల ద్వారా రూ.432.09 కోట్లు.

పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదల:** ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం రూ.800 కోట్లు.

గ్రామీణ రహదారులు:** ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు.

రహదారులు, వంతెనలు: **పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ.350 కోట్లు.

 కొబ్బరి ప్రోత్సాహక పథకం

కొ­బ్బ­రి ఉత్ప­త్తి­ని పెం­చ­టం కోసం కొ­బ్బ­రి ప్రో­త్సా­హక పథ­కా­న్ని తీ­సు­కొ­చ్చి­న­ట్లు ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌ తె­లి­పా­రు. తీర ప్రాం­తా­ల్లో కొ­బ్బ­రి, గంధం చె­ట్ల ఏర్పా­టు­కు ప్రో­త్సా­హం ఇస్తా­మ­న్నా­రు. కా­య­లు­కా­య­ని కొ­బ్బ­రి చె­ట్ల స్థా­నం­లో కొ­త్త చె­ట్ల ఏర్పా­టు­కు ప్రో­త్సా­హ­కా­లు అం­ది­స్తా­మ­న్నా­రు. ఈ పథకం ము­ఖ్యం­గా AP­లో­ని రై­తు­ల­కు ఉప­శ­మ­నం కలి­గి­స్తుం­ద­న్నా­రు. కొ­బ్బ­రి తో­ట­లో అగ్ని­ప్ర­మా­దం వల్ల కలి­గిన నష్టా­న్ని తే­లి­క­ప­రు­స్తుం­ద­న్నా­రు. కొబ్బరి ప్రోత్సాహక పథకం ఏపీ రైతులకు ప్రయోజనకరంగా మారనుంది.

క్యాన్సర్ బాధితులకు కొత్త ఊపిరి

కేం­ద్ర బడ్జె­ట్ 2026లో భా­గం­గా ఆర్థిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్ కొ­న్ని ఉప­శ­మ­నా­లు కల్పిం­చా­రు. క్యా­న్స­ర్ చి­కి­త్స భా­రా­న్ని తగ్గి­స్తూ.. 17 రకాల ప్రా­ణ­ర­క్షక ఔష­ధా­ల­పై కస్ట­మ్స్ సుం­కా­న్ని రద్దు చే­శా­రు. పర్యా­వ­ర­ణ­హిత ఇం­ధ­నా­న్ని ప్రో­త్స­హి­స్తూ బయో గ్యా­స్ ఆధా­రిత CNG­కి సెం­ట్ర­ల్ ఎక్సై­జ్ మి­న­హా­యిం­పు ఇచ్చా­రు. అలా­గే మై­క్రో­వే­వ్ ఓవె­న్లు, పౌర వి­మా­నాల వి­డి­భా­గా­ల­పై పన్ను­లు తగ్గిం­చ­డం ద్వా­రా ఆయా రం­గా­ల­కు ఊత­మి­చ్చిం­ది. క్యా­న్స­ర్ బా­ధి­తు­ల­కు ఇది ఊర­ట­ను ఇవ్వ­నుం­ది.

ఏపీ ప్ర­జల జీ­వ­న­శై­లి­ని మా­ర్చేం­దు­కు కేం­ద్ర బడ్జె­ట్‌ దో­హ­ద­ప­డు­తుం­ద­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అన్నా­రు. గొ­ప్ప బడ్జె­ట్‌ ప్ర­వే­శ­పె­ట్టిన ఆర్థిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌­కు అభి­నం­ద­న­లు తె­లి­పా­రు. కు­ప్పం­లో ఏర్పా­టు చే­సిన మీ­డి­యా సమా­వే­శం­లో సీఎం మా­ట్లా­డా­రు. ‘‘రా­ష్ట్ర ప్ర­భు­త్వం దృ­ష్టి సా­రిం­చిన అం­శా­ల్లో మరింత దూ­కు­డు­గా వె­ళ్లేం­దు­కు ఈ బడ్జె­ట్టు సహ­క­రిం­చే­లా ఉంది. రా­ష్ట్రం అమలు చే­స్తు­న్న ఈజ్ ఆఫ్ డూ­యిం­గ్ బి­జి­నె­స్ వి­ధా­నా­ని­కి ఈ బడ్జె­ట్ మరింత సహ­క­రిం­చే­లా ఉంది. రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే ఎం­ఎ­స్ఎం­ఈ­ల­పై ఎక్కు­వ­గా దృ­ష్టి సా­రిం­చిం­ది. వీ­టి­ని మరింత బలో­పే­తం చే­సు­కు­నే అవ­కా­శం ఉంది. మహి­ళ­లు, రై­తు­లు, యువత సా­ధి­కా­రిత సా­ధిం­చే­లా బడ్జె­ట్ ఉంది. 2047 వి­క­సి­త్ భా­ర­త్ డె­వ­ల­ప్డ్ ఎకా­న­మీ­గా మా­రేం­దు­కు ఇది ఉప­యో­గ­ప­డు­తుం­ది. ఆర్ధిక మం­త్రి ని­ర్మ­లా­సీ­తా­రా­మ­న్‌ బ్యా­లె­న్స్‌­డ్‌ బడ్జె­ట్ ప్ర­వే­శ­పె­ట్టా­రు. ఏఐ సహా వి­విధ టె­క్నా­ల­జీ­లు, నె­క్స్ట్‌ లె­వ­ల్ ఆఫ్ రి­ఫా­ర్మ్స్ కు వె­ళ్తుం­ది. రె­న్యు­వ­బు­ల్ ఎన­ర్జీ, వన్ గ్రి­డ్ నే­ష­న్ ది­శ­గా బడ్జె­ట్ ఉంది. స్వ­ల్ప, మధ్య, దీ­ర్ఘ­కా­లిక లక్ష్యా­ల­కు అను­గు­ణం­గా రూ­పొం­దిం­చా­రు. మె­రు­గైన జీవన ప్ర­మా­ణా­లు, ఈజ్ ఆఫ్ లి­విం­గ్ కోసం దో­హ­దం చే­సే­లా బడ్జె­ట్‌ ఉంది." అని­చం­ద్ర­బా­బు అన్నా­రు.

మోదీ, నిర్మలమ్మకు లోకేశ్ కృతజ్ఞతలు

భా­ర­త­దేశ వే­గ­వం­త­మైన అభి­వృ­ద్ధి లక్ష్యా­ల­కు, దీ­ర్ఘ­కా­లిక ఆకాం­క్ష­ల­కు అను­గు­ణం­గా కేం­ద్ర బడ్జె­ట్‌­ను ప్ర­వే­శ­పె­ట్టి­నం­దు­కు ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర మోదీ, ఆర్థిక మం­త్రి  ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌­కు ఏపీ మం­త్రి నారా లో­కే­శ్‌ కృ­త­జ్ఞ­త­లు తె­లి­పా­రు. ఈ బడ్జె­ట్ ద్వా­రా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు గణ­నీ­య­మైన మేలు జర­గ­నుం­ద­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు.

Tags:    

Similar News