BANAKACHARLA: బనకచర్ల పేరిట ప్రాంతీయ విద్వేషాలు: నారా లోకేశ్

Update: 2025-08-01 07:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­శ్ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. రా­జ­కీయ లబ్ధి కో­స­మే తె­లు­గు రా­ష్ట్రాల మధ్య నీటి వి­వా­దా­లు సృ­ష్టి­స్తు­న్నా­ర­ని లో­కే­ష్‌ ఆరో­పిం­చా­రు. మి­గు­లు జలా­లు వా­డు­కుం­టా­మం­టే అభ్యం­త­రం చె­బు­తు­న్నా­ర­ని.. కా­ళే­శ్వ­రం కట్టే­ముం­దు అను­మ­తు­లు­న్నా­యా అని లో­కే­ష్‌ ని­ల­దీ­శా­రు. ది­గువ రా­ష్ట్రం­లో ప్రా­జె­క్ట్ కడి­తే.... ఎగువ రా­ష్ట్రా­ని­కి అభ్యం­త­ర­మేం­ట­ని లో­కే­శ్ ప్ర­శ్నిం­చా­రు.

లోకేష్ పై అద్దంకి ఫైర్

నారా లో­కే­ష్‌ వ్యా­ఖ్య­ల­పై తె­లం­గాణ కాం­గ్రె­స్ నేత అద్దం­కి దయా­క­ర్‌ ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. లో­కే­ష్‌ వ్యా­ఖ్య­లు తె­లు­గు రా­ష్ట్రాల మధ్య.. వి­వా­దా­లు సృ­ష్టిం­చే­లా ఉన్నా­య­ని అద్దం­కి దయా­క­ర్ అన్నా­రు. ఇలాం­టి ప్ర­క­ట­న­లు ఇరు రా­ష్ట్రా­ల­కు మం­చి­ది కా­ద­న్న ఆయన... రెం­డు­రా­ష్ట్రాల మధ్య సఖ్యత కోసం తాము కృషి చే­స్తు­న్నా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. సమ­స్య శా­శ్వత పరి­ష్కా­రా­ని­కి చూ­స్తు­న్నా­మ­ని అద్దం­కి తె­లి­పా­రు. తె­లు­గు రా­ష్ట్రాల మధ్య బన­క­చ­ర్ల వి­ష­యం­లో చాలా రో­జు­లు­గా రగడ జరు­గు­తోం­ది. బన­క­చ­ర్ల­ను ఎట్టి పరి­స్థి­తు­ల్లో కట్ట­ని­య్య­బో­మ­ని రే­వం­త్ ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే వె­ల్ల­డిం­చిం­ది. కే­సీ­ఆ­ర్ కూడా మరో నీటి ఉద్య­మా­ని­కి పి­లు­పు­ని­చ్చా­రు. ఈ నే­ప­థ్యం­లో నారా లో­కే­శ్ చే­సిన వ్యా­ఖ్య­లు సం­చ­ల­నం రే­పు­తు­న్నా­యి. ఇప్ప­టి­వ­ర­కూ ఏపీ నుం­చి ఏ నేత కూడా బన­క­చ­ర్ల­పై ఇం­త­టి వ్యా­ఖ్య­లు చే­య­లే­దు. ఇప్పు­డు నారా లో­కే­శ్ చే­సిన వ్యా­ఖ్య­లు తె­లు­గు రా­ష్ట్రాల మధ్య అగ్గి­ని రా­జే­సే అవ­కా­శా­లు ఉన్నా­యి. మరో­వై­పు ఏపీ ప్ర­భు­త్వం బన­క­చ­ర్ల­ను ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ ని­ర్మి­స్తా­మ­ని గట్టి­గా చె­బు­తోం­ది.

Tags:    

Similar News