Vizianagaram Bengal Tiger : కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బెంగాల్ టైగర్..
Vizianagaram Bengal Tiger : విజయనగరం జిల్లా వాసులను రాయల్ బెంగాల్ టైగర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Vizianagaram Bengal Tiger : విజయనగరం జిల్లా వాసులను రాయల్ బెంగాల్ టైగర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీశాఖ అధికారులకు చిక్కకుండా సవాల్ విసురుతోంది. తాజాగా బొండపల్లి మండలం కొత్తపసలపాడులో ఆవుల మందపై రాయల్ బెంగాల్ టైగర్ దాడి చేసింది. పులి పంజాకు రెండు ఆవులు మృతిచెందాయి. టైగర్ దాడితో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అటు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అటు బెంగాల్ టైగర్ కోసం అటవీ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పాదముద్రల ఆనవాళ్లు గుర్తించి ప్రత్యేక బృందాలతో వేట కొనసాగిస్తున్నారు. పులిసంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు.