MAOIST : మావోలకు మరో ఎదురుదెబ్బ..లొంగిపోయిన దేవ్​జీ!

మావోయిస్టు పార్టీ మరో భారీ ఎదురుదెబ్బ... ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం... మావో అగ్ర నేత దేవ్ జీ అలియాస్ తిరుపతి సరెండర్

Update: 2026-02-22 11:47 GMT

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో కీలక మలుపు తిరిగింది. భద్రతా బలగాల తీవ్ర నిర్బంధం, వరుస ఆపరేషన్లు, అగ్రనేతల మరణాలు, లొంగుబాట్లతో ఇప్పటికే బలహీనంగా మారిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. పార్టీ టాప్ కమాండర్‌గా భావిస్తున్న దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, అలాగే పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్‌ఐబీ ఎదుట లొంగిపోవడం ఉద్యమ భవిష్యత్తుపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మావోయిస్టు పార్టీ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. నంబాల కేశవరావు మృతి అనంతరం ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన అధికారికంగా జనరల్ సెక్రటరీనా కాదా అన్న విషయంపై గతంలో చర్చలు సాగినా, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఆయననే ప్రధాన దిక్సూచి అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న గతంలో దేవ్‌జీని సుప్రీం కమాండర్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించగా, మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వంటి వారు ఆ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్–2, కర్రె గుట్టలు–2 వంటి ప్రత్యేక ఆపరేషన్లను ప్రారంభించాయి. దేవ్‌జీ, రాజిరెడ్డిని లక్ష్యంగా ఈ ఆపరేషన్లు సాగాయి.

మావోయిస్టు పార్టీలో పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. నంబాల కేశవరావు, హిడ్మా, టెక్ శంకర్ తదితరుల మరణం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. మరికొందరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, బర్స దేవా వంటి వారు కూడా సరెండర్ అయ్యారు. ఈ పరిణామాలతో పార్టీ బలహీన స్థితిలోకి వెళ్లింది. ఇలాంటి సమయంలో దేవ్‌జీ వంటి అగ్రనేత లొంగిపోవడం ఉద్యమానికి తీవ్రమైన మానసిక దెబ్బగా భావిస్తున్నారు.

ఉనికి కోల్పోయిన మావో ఉద్యమం

రా­జి­రె­డ్డి అలి­యా­స్ సం­గ్రా­మ్ కూడా మా­వో­యి­స్టు పొ­లి­ట్‌­బ్యూ­రో సభ్యు­డి­గా ఉన్నా­రు. అనా­రో­గ్య సమ­స్య­ల­తో బా­ధ­ప­డు­తు­న్న ఆయన, తీ­వ్ర ఒత్తి­డి పరి­స్థి­తు­ల్లో లొం­గి­పో­వా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్న­ట్లు సమా­చా­రం. తమ పరి­చ­యాల ద్వా­రా తె­లం­గా­ణ­లో­ని పె­ద్ద­ల­తో సం­ప్ర­దిం­పు­లు జరి­పి, చి­వ­ర­కు ఎస్‌­ఐ­బీ ముం­దు లొం­గి­పో­యి­న­ట్లు తె­లు­స్తోం­ది. దే­వ్‌­జీ, రా­జి­రె­డ్డి సహా మొ­త్తం 16 మంది మా­వో­యి­స్టు­లు అధి­కా­రి­కం­గా లొం­గి­పో­వ­డం వి­శే­షం. మరో రెం­డు రో­జు­ల్లో వీ­రి­ని మీ­డి­యా ముం­దు ప్ర­వే­శ­పె­ట్ట­ను­న్న­ట్లు సమా­చా­రం. అగ్ర­నేత లొం­గి­పో­వ­డం­తో మి­గ­తా కే­డ­ర్ కూడా అదే మా­ర్గం­లో నడి­చే అవ­కా­శా­లు ఉన్నా­య­ని భద్ర­తా వర్గా­లు అం­చ­నా వే­స్తు­న్నా­యి. గె­రి­ల్లా తరహా సా­యుధ పో­రా­టం ప్ర­స్తుత పరి­స్థి­తు­ల్లో సా­ధ్యం­కా­ద­నే ని­ర్ణ­యా­ని­కి దే­వ్‌­జీ వచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. ని­రం­తర కం­బిం­గ్ ఆప­రే­ష­న్లు, సాం­కే­తిక పర్య­వే­క్షణ, ఆర్థిక వన­రుల కొరత వంటి కా­ర­ణా­లు ఉద్య­మా­న్ని బల­హీ­న­ప­రి­చి­న­ట్లు వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. దేవ్‌జీ- రాజిరెడ్డి లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష్య సాధన దిశగా ఇది పెద్ద అడుగుగా భావిస్తున్నారు. అయితే ఉద్యమం పూర్తిగా అంతమైందని చెప్పేందుకు ఇంకా సమయం అవసరం. అయినప్పటికీ, అగ్రనేతల వరుస లొంగుబాట్లు, మరణాలు మావోయిస్టు పార్టీ భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేశాయి. మార్చి 31 గడువు సమీపిస్తున్న వేళ, ఈ పరిణామాలు దేశ భద్రతా వ్యూహాలకు బలాన్ని చేకూర్చినట్టే కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News