National Executive of BJP : నూతన జాతీయ కార్యవర్గంలో తెలుగు వారికి కీలక పదవులు..!
National Executive of BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలలోని కీలక నేతలకి కీలకపదవులు దక్కాయి.;
National Executive of BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలలోని కీలక నేతలకి కీలకపదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుండి కన్నా లక్ష్మినారాయణ, తెలంగాణ నుండి జి. కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు చోటు దక్కింది. తెలంగాణ నుండి డికె. అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చోటు లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుండి పురుందేశ్వరికి చోటు దక్కింది. జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుండి సత్యకుమార్‌కు స్థానం దక్కింది. తెలంగాణ నుండి విజయశాంతి, ఈటెల రాజేందర్ ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు దక్కింది.