తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయలుదేరిన మినీ లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగం వల్లే లారీ బోల్తా పడినట్లు అనుమానిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయలుదేరింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో మినీ లారీ బయలుదేరింది. అతి వేగం వల్లే లారీ బోల్తా పడినట్లు అనుమానిస్తున్నారు. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు.
మృతుల వివరాలు
తూర్పుగోదావరి జిల్లాలో మినీ లారీ బోల్తాపడి మరణించిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి. చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ ఈ ప్రమాదంలో మృతి చెందారని తెలిపారు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.