SRISAILAM: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు
విధుల్లో ఉన్న ఉద్యోగుల ఆందోళన... విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత;
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. 7వ నంబర్ జనరేటర్‌లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌కు అధికారులు మరమ్మతు పనులు చేస్తున్నారు.
చంద్రబాబు పర్యటన రద్దు
ఎం చంద్రబాబు రేపల్లె పర్యటన రద్దు చేసుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో నేడు చేపట్టనున్న ఏరియల్ సర్వే రద్దు చేసుకున్నారు. దీంతో వరద బాధితులకు ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య పనులను, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కాలనీలు, ఇళ్లలో ఉన్న బురదను తొలగించాలని ఆదేశించారు.
జేసీబీ పై సీఎం పర్యవేక్షణ
విజయవాడలోని నగరంలో సీఎం చంద్రబాబు జేసీబీ పై సుమారు 22 కిలోమీటర్ల ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. కాన్వాయ్ పక్కనపెట్టి నాలుగున్నర గంటలపాటు జేసీబీపైనే తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షించారు. దారి పొడవునా బాధితులను పలకరించారు. ఆహారం, నీళ్లు అందుతున్నాయా అని సీఎం ఆరా తీశారు. అధికారుల్లో బాధ్యత, భయం తీసుకురావాలనే తాను విస్తృతంగా పర్యటిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.