AP: ఆంధ్రప్రదేశ్‌కు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్

ఈనెల 18న అమరావతికి రానున్న బిల్ గేట్స్... సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం... పలు కీలక ప్రాజెక్టులపై గేట్స్-బాబు చర్చలు

Update: 2026-02-05 05:30 GMT

ఇటీ­వల ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­భు­త్వం చే­ప­డు­తు­న్న సాం­కే­తిక ఆధా­రిత అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­కు అం­త­ర్జా­తీయ స్థా­యి­లో ప్రా­ధా­న్యం పె­రు­గు­తోం­ది. ఈ నే­ప­థ్యం­లో మై­క్రో­సా­ఫ్ట్‌ వ్య­వ­స్థా­ప­కు­డు బిల్ గే­ట్స్ ఈ నెల 18న అమ­రా­వ­తి­కి రా­ను­న్న­ట్టు అధి­కార వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. రా­ష్ట్ర ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­తో ఆయన ప్ర­త్యే­కం­గా భేటీ కా­ను­న్నా­రు. ఈ సమా­వే­శం­లో రా­ష్ట్ర భవి­ష్య­త్‌ అభి­వృ­ద్ధి­కి సం­బం­ధిం­చిన కీలక అం­శా­ల­పై వి­స్తృత చర్చ జరి­గే అవ­కా­శం ఉం­ద­ని సమా­చా­రం. ప్ర­ధా­నం­గా ఆరో­గ్య సం­ర­క్షణ, వ్య­వ­సా­యం, వి­ద్య వంటి కీలక రం­గా­ల్లో ఆధు­నిక సాం­కే­తి­కత, ము­ఖ్యం­గా కృ­త్రిమ మేధ (ఏఐ) వి­ని­యో­గా­న్ని ఎలా మరింత ప్ర­భా­వ­వం­తం­గా అమలు చే­యా­ల­న్న­దా­ని­పై ఇరు­వు­రి మధ్య చర్చ కేం­ద్రీ­కృ­త­మ­య్యే అవ­కా­శ­ముం­ది. ఇప్ప­టి­కే గత ఏడా­ది మా­ర్చి­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­భు­త్వం, బిల్ అండ్ మి­లిం­దా గే­ట్స్ ఫౌం­డే­ష­న్ మధ్య అవ­గా­హన ఒప్పం­దం కు­ది­రిం­ది. ఈ ఒప్పం­దం ద్వా­రా రా­ష్ట్రం­లో­ని ప్ర­జ­ల­కు నా­ణ్య­మైన సే­వ­లు వే­గం­గా అం­దిం­చ­డ­మే లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు.

ఆరోగ్య సేవల్లోనూ....

ఆరో­గ్య సే­వ­ల్లో డేటా ఆధా­రిత వి­శ్లే­షణ, డి­జి­ట­ల్‌ వ్య­వ­సాయ వి­ధా­నా­లు, పా­ల­న­లో టె­క్నా­ల­జీ వి­ని­యో­గం వంటి అం­శా­ల­ను సమ­గ్రం­గా అమలు చే­యా­ల­న్న­ది ఈ భా­గ­స్వా­మ్య ప్ర­ధాన ఉద్దే­శ్యం. గ్రా­మీణ స్థా­యి నుం­చి పట్టణ స్థా­యి వరకు ప్ర­జ­ల­కు అందే సే­వ­ల్లో పా­ర­ద­ర్శ­కత, వేగం పె­ర­గా­ల­న్న దృ­ష్టి­తో ప్ర­భు­త్వం ముం­ద­డు­గు వే­స్తోం­ది. ఈ ప్రా­జె­క్టుల ప్ర­స్తుత అమలు స్థి­తి, భవి­ష్య­త్‌ కా­ర్యా­చ­ర­ణ­పై ము­ఖ్య­మం­త్రి – బి­ల్‌ గే­ట్స్‌ భే­టీ­లో స్ప­ష్టత రా­వ­చ్చ­ని అధి­కార వర్గా­లు భా­వి­స్తు­న్నా­యి. ఇది­లా ఉం­డ­గా, అమ­రా­వ­తి­ని అం­త­ర్జా­తీయ స్థా­యి టె­క్నా­ల­జీ హబ్‌­గా అభి­వృ­ద్ధి చే­యా­ల­న్న లక్ష్యం­తో ప్ర­భు­త్వం చే­ప­డు­తు­న్న “క్వాం­ట­మ్‌ వ్యా­లీ” ప్రా­జె­క్టు­పై కూడా చర్చ జరి­గే అవ­కా­శం ఉం­ద­ని సమా­చా­రం. ఈ క్వాం­ట­మ్‌ వ్యా­లీ­లో మై­క్రో­సా­ఫ్ట్‌ పె­ట్టు­బ­డు­లు పె­ట్టే ప్ర­తి­పా­దన ఉం­ద­న్న ప్ర­చా­రం కొం­త­కా­లం­గా వి­ని­పి­స్తోం­ది. బి­ల్‌ గే­ట్స్‌ పర్య­టన సం­ద­ర్భం­గా ఈ అం­శం­పై అధి­కా­రిక స్ప­ష్టత వచ్చే అవ­కా­శ­ముం­ద­ని రా­జ­కీయ, పా­రి­శ్రా­మిక వర్గా­ల్లో ఆస­క్తి నె­ల­కొం­ది. మరో­వై­పు, రా­ష్ట్రా­న్ని “ఆరో­గ్యాం­ధ్ర­ప్ర­దే­శ్‌”గా తీ­ర్చి­ది­ద్దా­ల­న్న లక్ష్యం­తో కూ­ట­మి ప్ర­భు­త్వం వే­గం­గా అడు­గు­లు వే­స్తోం­ది. ఈ ది­శ­గా అత్యంత ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా రూ­పొం­దిం­చిన “సం­జీ­వ­ని” ప్రా­జె­క్టు­ను త్వ­ర­లో­నే రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా అమలు చే­య­ను­న్నా­రు. ఈ ప్రా­జె­క్టు ద్వా­రా ప్ర­జల ఆరో­గ్యా­న్ని ముం­ద­స్తు­గా పర్య­వే­క్షిం­చ­డం, వ్యా­ధు­ల­ను తొ­లి­ద­శ­లో­నే గు­ర్తిం­చ­డం ప్ర­ధాన లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు.

సంజీవని ప్రాజెక్టు...

సం­జీ­వ­ని ప్రా­జె­క్టు కింద రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా సు­మా­రు 72 లక్షల మం­ది­కి వి­విధ రకాల వై­ద్య పరీ­క్ష­లు ని­ర్వ­హిం­చి, వారి ఆరో­గ్యా­ని­కి సం­బం­ధిం­చిన సమ­గ్ర హె­ల్త్‌ ప్రొ­ఫై­ల్స్‌ రూ­పొం­దిం­చ­ను­న్న­ట్టు ము­ఖ్య­మం­త్రి ఇటీ­వల వె­ల్ల­డిం­చా­రు. ఈ ప్రా­జె­క్టు­లో బిల్ అండ్ మి­లిం­దా గే­ట్స్ ఫౌం­డే­ష­న్కీ లక భా­గ­స్వా­మి­గా వ్య­వ­హ­రి­స్తోం­ది. అత్యా­ధు­నిక సాం­కే­తి­క­త­ను వి­ని­యో­గిం­చి ప్ర­జల ఆరో­గ్య సమా­చా­రా­న్ని సు­ర­క్షి­తం­గా, సమ­ర్థం­గా ని­ర్వ­హిం­చ­డ­మే ఈ కా­ర్య­క్ర­మం ప్ర­త్యే­క­త­గా పే­ర్కొ­న్నా­రు. ప్ర­భు­త్వం, గే­ట్స్‌ ఫౌం­డే­ష­న్‌, అలా­గే టాటా కన్స­ల్టె­న్సీ సహ­కా­రం­తో డి­జి­నె­ర్వ్‌ సెం­ట­ర్‌ ద్వా­రా ప్ర­తి పౌ­రు­డి­కి డి­జి­ట­ల్‌ హె­ల్త్‌ రి­కా­ర్డు రూ­పొం­ది­స్తు­న్న­ట్టు సీఎం వి­వ­రిం­చా­రు. ఈ డి­జి­ట­ల్‌ రి­కా­ర్డు­లు భవి­ష్య­త్‌­లో వై­ద్య సే­వ­లు పొం­దే­ట­ప్పు­డు కీ­ల­కం­గా ఉప­యో­గ­ప­డ­తా­య­ని తె­లి­పా­రు. వ్య­క్తుల ఆరో­గ్య పరి­స్థి­తి­ని ఎప్ప­టి­క­ప్పు­డు గమ­నిం­చి, సూ­చ­న­లు ఇవ్వ­డా­ని­కి ఈ వ్య­వ­స్థ ఉప­యో­గ­ప­డ­నుం­ద­ని ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది.

పైలెట్ ప్రాజెక్టు కుప్పంలో....

సం­జీ­వ­ని ప్రా­జె­క్టు­ను తొలి దశలో కు­ప్పం­లో పై­ల­ట్‌ ప్రా­జె­క్టు­గా ప్రా­రం­భిం­చి, వి­జ­య­వం­తం­గా అమలు చే­సిన తర్వాత చి­త్తూ­రు జి­ల్లా­కు వి­స్త­రిం­చా­రు. ప్ర­స్తు­తం లభి­స్తు­న్న ఫలి­తా­ల­ను బట్టి ఈ ఏడా­ది­లో­నే రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా వి­స్త­రిం­చే­లా కా­ర్యా­చ­రణ రూ­పొం­ది­స్తు­న్నా­మ­ని ము­ఖ్య­మం­త్రి వె­ల్ల­డిం­చా­రు. వై­ద్య పరీ­క్షల అనం­త­రం ప్ర­తి వ్య­క్తి­కి ఆరో­గ్య స్కో­రిం­గ్‌ ఇవ్వ­డం ద్వా­రా, వారు తమ ఆరో­గ్య స్థి­తి­ని సు­ల­భం­గా అర్థం చే­సు­కు­నే వి­ధం­గా చర్య­లు తీ­సు­కుం­టు­న్న­ట్టు తె­లి­పా­రు. ఈ ప్రా­జె­క్టు కింద మొ­త్తం 42 రకాల వై­ద్య పరీ­క్ష­లు ని­ర్వ­హిం­చేం­దు­కు ఇప్ప­టి­కే ఆదే­శా­లు జారీ చే­సి­న­ట్టు ప్ర­భు­త్వం స్ప­ష్టం చే­సిం­ది. రక్త­ప­రీ­క్ష­లు, జీ­వ­న­శై­లి సం­బం­ధిత పరీ­క్ష­లు, దీ­ర్ఘ­కా­లిక వ్యా­ధుల గు­ర్తిం­పు వంటి అం­శా­లు ఇం­దు­లో భా­గం­గా ఉం­టా­య­ని అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. దీని ద్వా­రా ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల­పై భారం తగ్గ­డం­తో పాటు, ప్ర­జ­ల­కు ముం­ద­స్తు ఆరో­గ్య భద్రత కల్పిం­చా­ల­న్న­ది ప్ర­భు­త్వ ఉద్దే­శం. మొ­త్తం­గా చూ­స్తే, బి­ల్‌ గే­ట్స్‌ అమ­రా­వ­తి పర్య­టన రా­ష్ట్ర అభి­వృ­ద్ధి­కి కీలక మలు­పు­గా మారే అవ­కా­శ­ముం­ద­ని రా­జ­కీయ వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. ఈ అనం­త­రం వె­లు­వ­డే ని­ర్ణ­యా­లు ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ భవి­ష్య­త్‌ అభి­వృ­ద్ధి ది­శ­ను మలు­పు తి­ప్పు­తా­య­న్న అం­చ­నా­లు పె­రు­గు­తు­న్నా­యి.

Tags:    

Similar News