బర్డ్ ఫ్లూ భయం: అనూహ్యంగా పడిపోయిన చికెన్ రేట్లు!
. బర్డ్ ఫ్లూతో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకు మన వద్ద బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాకపోయినా కోళ్లు, పక్షులు మృతి చెందడం కలవరపెడుతోంది.;
కరోనా విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఏపీ, తెలంగాణ ప్రజలు. ఈ పరిస్థితుల్లో మరో పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. బర్డ్ ఫ్లూతో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకు మన వద్ద బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాకపోయినా కోళ్లు, పక్షులు మృతి చెందడం కలవరపెడుతోంది.
బర్డ్ ఫ్లూ ప్రచారంతో రాయలసీమ వణుకుతోంది. కడప జిల్లా పులివెందులలో దాదాపు వంద కోళ్లు చనిపోవడంతో ఆందోళన నెలకొంది. కె.వెలమవారిపల్లె గ్రామంలోని వంద కోళ్లు అకస్మాత్తుగా చనిపోయాయి. ఎక్కడ ఉన్న కోడి అక్కడే కుప్పకూలిపోతుండడం గమనించిన రైతులు ఏం జరుగుతోందో తెలియక భయపడుతున్నారు. ఓకేసారి ఇన్ని కోళ్లు చనిపోవడం ఎప్పుడూ చూడడం లేదంటున్నారు. ఓ వైపు బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న సమయంలో కోళ్లు ఇలా మృత్యువాత పడడం ఆందోళన పెంచుతోంది. అయితే ఇవి బర్డ్ ఫ్లూ మరణాలు కావంటున్నారు అధికారులు.
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండాలో బర్డ్ ఫ్లూ అనుమానాలు తలెత్తాయి. ఓ పౌల్ట్రీ ఫాంలో కోళ్లు వరుసగా మృతి చెందుతున్నాయి. గంటల వ్యవధిలోనే వందల కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ సోకిందా అనే అనుమానం స్థానికుల్లో ఉంది. ఆ భయంతో చనిపోయిన కోళ్లను ఓ గుంతతీసి కప్పెట్టేశారు. స్థానికుల సమాచారంతో పౌల్ట్రీ ఫామ్ కు చేరుకున్న అధికారులు చనిపోయిన కోళ్ల నమూనాలు సేకరించారు..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాకపోయినా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రతి జిల్లాలోనూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాయి. పౌల్ట్రీల దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చనిపోయిన కోళ్లు, పక్షుల నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు వరకు కోవిడ్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ తమ వ్యాపారాలను పూర్తి స్థాయిలో కుదేలు చేశాయని వాపోతున్నారు పౌల్ట్రీ వ్యాపారులు.