BOTSA:"జగన్ నుంచే బొత్సకు ప్రాణహాని"

ప్రాణహాని ఉందన్న బొత్స వ్యాఖ్యలపై ఆగ్రహం

Update: 2025-10-12 02:30 GMT

వై­ఎ­స్ జగ­న్‌ నుం­చే ఎమ్మె­ల్సీ బొ­త్స సత్య­నా­రా­య­ణ­కు ప్రా­ణ­హా­ని ఉం­డొ­చ్చ­ని టీ­డీ­పీ రా­ష్ట్రా­ధ్య­క్షు­డు పల్లా శ్రీ­ని­వా­స­రా­వు అను­మా­నం వ్య­క్తం చే­శా­రు. పై­డి­త­ల్లి సి­రి­మా­నో­త్స­వం­లో వే­దిక కూ­లిన ఘట­న­లో తనకు అధి­కార పా­ర్టీ నా­య­కుల నుం­చి ప్రా­ణ­హా­ని ఉం­ద­ని ఎమ్మె­ల్సీ బొ­త్స సత్య­నా­రా­యణ చే­సిన వ్యా­ఖ్య­ల­కు ఆయన స్ట్రాం­గ్ కౌం­ట­ర్ ఇచ్చా­రు. బొ­త్స­కు కూ­ట­మి నుం­చి ఎలాం­టి ప్రా­ణ­హా­ని లే­ద­ని తె­లి­పా­రు. కా­క­పో­తే సొంత పా­ర్టీ నుం­చే ప్రా­ణ­హా­ని ఉం­డొ­చ్చ­న్నా­రు. ఈ వి­ష­యా­న్ని బొ­త్స చె­ప్పు­కో­లే­క­పో­తు­న్నా­ర­ని ఎద్దే­వా చే­శా­రు. మం­డ­లి­లో బొ­త్స కొంత రా­ణిం­చే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని, అం­దు­కే జగ­న్‌ నుం­చే ప్రాణ హాని ఉం­టుం­దో­మో­న­న్నా­రు. బొ­త్స రక్షణ కో­రి­తే చం­ద్ర­బా­బు ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­ర­ని తె­లి­పా­రు.

వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ నేత బొ­త్స సత్య­నా­రా­యణ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. తనను అం­త­మొం­దిం­చేం­దు­కు కొం­ద­రు కు­ట్ర పన్నా­ర­ని ఆరో­పిం­చా­రు. పై­డి­త­ల్లి సి­రి­మా­నో­త్స­వం­లో వే­దిక కూ­లి­పో­వ­డం­పై కలె­క్ట­ర్, ఎస్పీల బా­ధ్య­త­ను ప్ర­శ్నిం­చా­రు. ఈ వి­ష­యం­పై గవ­ర్న­ర్, సీ­ఎ­స్‌­ల­కు లేఖ రా­స్తా­న­ని తె­లి­పా­రు. అధి­కా­రు­లు ద్వం­ద్వ వై­ఖ­రి ప్ర­ద­ర్శిం­చా­ర­ని, ఆర్భా­టం, అహం­కా­రం తప్ప సాం­ప్ర­దా­యా­ల­కు తా­వి­వ్వ­లే­ద­ని వి­మ­ర్శిం­చా­రు. బొ­త్స సత్య­నా­రా­యణ చే­సిన వ్యా­ఖ్య­లు దు­మా­రం రే­పా­యి. పై­డి­త­ల్లి అమ్మ­వా­రి పం­డుగ ని­ర్వ­హ­ణ­లో అవ­క­త­వ­క­లు జరి­గా­యం­టూ మం­డ­లి పక్ష నేత, మాజీ మం­త్రి బొ­త్స సత్య­నా­రా­యణ తీ­వ్రం­గా మం­డి­ప­డ్డా­రు. పై­డి­త­ల్లి అమ్మ­వా­రి జా­త­ర­లో ప్ర­భు­త్వం ప్ర­మా­ణా­లు పా­టిం­చ­లే­ద­ని, సం­ప్ర­దా­యా­ల­ను పక్క­న­బె­ట్టి అహం­కా­రం­తో వ్య­వ­హ­రిం­చా­ర­ని ఆయన ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. ఈ ప్రాంత ప్ర­జ­లం­ద­రి­కీ పై­డి­త­ల్లి అమ్మ­వా­రు ఇల­వే­ల్పు­గా ఉన్నా­రు. ఏ రా­జ­కీయ పా­ర్టీ కూడా ఈ ఉత్స­వాల సమ­యం­లో రా­జ­కీ­యా­లు చే­య­దు.. కానీ, ఈసా­రి అధి­కా­రం­లో ఉన్న ప్ర­భు­త్వం, అధి­కా­రు­లు సం­ప్ర­దా­యా­ల­ను తుం­చే­శా­రు అని బొ­త్స వి­మ­ర్శిం­చా­రు. అధి­కా­రుల ని­ర్ల­క్ష్యా­న్ని ప్ర­స్తా­వి­స్తూ, ఎమ్మా­ర్వో, ఎం­డీ­వో, ఎక్సై­జ్, ఇలా అన్ని శా­ఖ­ల్లో­నూ హుం­డీ పె­ట్టి డబ్బు సే­క­రణ చే­య­డం ఏమి­టి? వీరు సి­వి­ల్ సర్వెం­ట్లా..? ఇది ధర్మ­మా? అని ప్ర­శ్నిం­చా­రు. తనకి ఏర్పా­టు చే­సిన స్టే­జ్ కూ­లి­పో­యిన ఘట­న­లో ఇద్ద­రు గా­య­ప­డ్డా­ర­ని పే­ర్కొ­న్నా­రు.. ఈ వి­ష­య­మై గవ­ర్న­ర్, సీ­ఎ­స్ లకు లేఖ రా­స్తా­న­న్నా­రు. ప్ర­భు­త్వ అల­స­త్వ­మే దీ­నం­త­టి­కీ కా­ర­ణం.

అధి­కా­రు­ల­పై ప్ర­భు­త్వా­ని­కి పట్ట లే­క­పో­వ­డం వల్లే ఇలాం­టి పరి­ణా­మా­లు చో­టు­చే­సు­కుం­టు­న్నా­యి అని శా­స­న­మం­డ­లి వి­ప­క్ష నేత బొ­త్స సత్య­నా­రా­యణ ధ్వ­జ­మె­త్తా­రు . గోవా గవ­ర్న­ర్ ఇంకా వి­జ­య­న­గ­రం­లో­నే ఉన్నా­ర­ని.. గతం­లో ఆయన చె­ప్పిన మా­ట­లు ఏమ­య్యా­య­ని ప్ర­శ్నిం­చా­రు బొ­త్స. అధి­కా­రు­ల­కు ఆయన ది­క్సూ­చి­గా ఎం­దు­కు ని­ల­బ­డ­లే­ద­ని.. . అమ్మ­వా­రి దర్శ­నా­ని­కి సం­బం­ధిం­చి తన వ్య­క్తి­గత ప్రో­టో­కా­ల్‌­పై తాను లేఖ రా­శా­న­ని, దా­ని­కి అధి­కా­రు­లు తో­చిన ఏర్పా­ట్లు చే­శా­ర­ని, అయి­తే ఉత్స­వా­ల్లో ఏం జరి­గిం­దో అం­ద­రూ చూ­శా­ర­న్నా­రు. తాము కూ­ర్చు­న్న వే­దిక కూ­లి­పో­వ­డం­పై తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు. ఇది కు­ట్ర­నా, అధి­కా­రుల అల­స­త్వ­మా, లేక తమను అవ­మా­నిం­చా­ల­ని చే­సిన పనా, లేక అం­త­మొం­దిం­చా­ల­ని చూ­శా­రా అని ప్ర­శ్నిం­చా­రు. అధి­కా­రు­లు దీ­ని­కి సమా­ధా­నం చె­ప్పా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. ఈ వే­దిక కూ­లిన ఘట­న­లో ఎమ్మె­ల్సీ సు­రే­ష్ బాబు చేయి డిస్ లో­కే­ట్ అయిం­ద­ని.. మరొ­క­రి­కి ఫ్రా­క్చ­ర్ అయిం­ద­ని, మరో అమ్మా­యి­కి కూడా దె­బ్బ­లు తగి­లా­య­న్నా­రు. అమ్మ­వా­రి పండగ సం­ద­ర్భం­గా జరి­గిన ని­ర్ల­క్ష్యం, అల­స­త్వం, కు­ట్ర అంటూ ఘాటు వ్యా­ఖ్య­లు చే­శా­రు బొ­త్స. ప్ర­జా­స్వా­మ్యం­లో ఇలాం­టి­వి సరై­న­వి కా­వ­ని, వీ­టి­ని ఉపే­క్షి­స్తే సమా­జా­ని­కి నష్ట­మ­న్నా­రు.దీని వె­నుక ఎవ­రు­న్నా­ర­నే పూ­ర్తి వి­వ­రా­లు బయ­ట­కు రా­వా­ల­ని, జి­ల్లా అధి­కా­రు­ల­ను ప్ర­శ్నిం­చా­రు. రా­జ­కీయ నా­య­కు­లు వ్య­క్తి­గత ఆలో­చ­న­ల­తో మా­ట్లా­డు­తా­ర­న్నా­రు. వ్య­క్తి­గత ప్ర­యో­జ­నాల కోసం వ్య­వ­స్థ­ల­ను ది­గ­జా­ర్చ­డం సరి­కా­ద­న్నా­రు.

Tags:    

Similar News