ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టివేత..!
సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.;
సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.. సీబీఐ, నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.. ఈ వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.