CBN: "సాంకేతిక ద్వారా సుపరిపాలన"`
శాఖల వారీగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం ఆదేశం
శాఖలవారీగా లక్ష్యాలు, సాధించిన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులు, ఉన్నాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో డేటా-డ్రివెన్ గవర్నెన్స్ - పాలనలో టెక్నాలజీ - ఆర్టీజీఎస్తో సమన్వయంపై మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాఖల వారీగా ఎవరు, ఎన్ని దస్త్రాలు ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తున్నారో తెలపాలన్నారు. ‘‘సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చి సమర్థంగా వాడాలి. ఇటీవల తుపానులో సాంకేతికతతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగాం. డేటా ఆధారిత పాలన అత్యంత కీలకమైన అంశంగా మారింది. రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో పౌరుల డేటా పొందుపరిచాం. 42 విభాగాల్లో డేటా మొత్తం అందుబాటులోకి తెచ్చాం. డిజిలాకర్‌లో విద్యార్థుల అన్ని ధ్రువపత్రాలు, ప్రజల హెల్త్ రికార్డులు ఉండాలి. వైద్యుడి వద్దకు వెళితే డిజిలాకర్‌లో హెల్త్ రికార్డులు లభించాలి. వీలైనంత త్వరగా దస్త్రాలు పూర్తి చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది. డేటా లేక్‌లో అన్ని విభాగాల డేటా తెలుసుకోవచ్చు. ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించాలి. రూల్ ప్రకారం లేకపోవడం వల్ల 60-70 శాతం పనులు లిటిగేషన్లలోఉంటున్నాయి. ఏఐని వాడితో జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చు.’’ అని చంద్రబాబు చెప్పారు.
ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు
ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్ టీచర్లను నియమించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంకేతిక విద్యను బలోపేతం చేయటానికి ఐసీటీ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో 2,837 పాఠశాలల్లో ఈ ప్రక్రియను చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 వేతనం ఇవ్వనున్నారు. కంప్యూటర్ వినియోగంపై పూర్తి అవగాహన ఉన్న అర్హులను తీసుకోనున్నారు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడానికి, పొరుగు సేవల విధానంలో ఈ కంప్యూటర్ టీచర్లను నియమించనున్నారు.
"తక్షణ సాయం చేయండి"
పత్తి రైతుల కష్టాలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఏపీ వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగిందని, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని లేఖలో పేర్కొన్నారు. అయితే మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్ ఆధార్ ఆధారిత ఈ-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్ చేసిందని చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ ను రాష్ట్ర సీఎం యాప్‌తో అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్న వివరించారు. రైతుల సౌకర్యం కోసం పలు చర్యలు తీసుకోవాలని కోరారు. కాపాస్ కిసాన్ యాప్ నుండి సీఎం యాప్ కు రైతు వివరాలు రియల్ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చేయాలన్నారు.