CBN: వెలిగొండకు పునాది వేసింది నేనే పూర్తి చేసేది నేనే

వెలిగొండకు జులై నాటికి శ్రీశైలం నీళ్లు తెస్తామన్న చంద్రబాబు.. ఫీడర్‌ కాలువ ఆధునికీకరణ పనులకు సీఎం శంకుస్థాపన... సొరంగంలో జరుగుతున్న పనులను పరిశీలించిన సీఎం

Update: 2026-02-26 02:30 GMT

మా­ర్కా­పు­రం ప్ర­జల దీ­ర్ఘ­కా­లిక తా­గు­నీ­టి, సా­గు­నీ­టి సమ­స్య­ల­కు శా­శ్వత పరి­ష్కా­రం చూ­పిం­చే లక్ష్యం­తో చే­ప­ట్టిన వె­లి­గొండ ప్రా­జె­క్టు పను­ల­ను వే­గ­వం­తం చే­స్తు­న్నా­మ­ని ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు ప్ర­క­టిం­చా­రు. గతం­లో తాను ప్రా­రం­భిం­చిన ఈ ప్రా­జె­క్టు­ను పూ­ర్తి­స్థా­యి­లో పూ­ర్తి చేసి ప్ర­జ­ల­కు అం­కి­తం చే­య­డం తన సం­క­ల్ప­మ­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. గం­ట­వా­ని­ప­ల్లె సమీ­పం­లో రూ.436 కో­ట్ల వ్య­యం­తో చే­ప­ట్ట­ను­న్న వె­లి­గొండ ఫీ­డ­ర్ కా­లువ ఆధు­ని­కీ­క­రణ పను­ల­కు బు­ధ­వా­రం ఆయన శం­కు­స్థా­పన చే­శా­రు. అనం­త­రం ప్రా­జె­క్టు సొ­రం­గం­లో జరు­గు­తు­న్న పను­ల­ను దృ­శ్య మా­ధ్య­మం ద్వా­రా పరి­శీ­లిం­చి, ఇం­జి­నీ­ర్ల­తో మా­ట్లా­డి పు­రో­గ­తి­పై సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు.సు­మా­రు మూ­డు­ద­శా­బ్దాల క్రి­తం మా­ర్కా­పు­రం ప్రాం­తా­న్ని సం­ద­ర్శిం­చి­న­ప్పు­డు ప్ర­జ­లు తా­గు­నీ­టి కొ­ర­త­పై తనకు వి­న­తి­ప­త్రా­లు అం­ద­జే­శా­ర­ని సీఎం గు­ర్తు చే­శా­రు. ఆ సమ­స్య­కు శా­శ్వత పరి­ష్కా­రం­గా శ్రీ­శై­లం జలా­ల­ను ఈ ప్రాం­తా­ని­కి తీ­సు­కు­రా­వా­ల­నే సం­క­ల్పం­తో 1996 మా­ర్చి 5న వె­లి­గొండ ప్రా­జె­క్టు­కు శం­కు­స్థా­పన చేసి పను­లు ప్రా­రం­భిం­చా­మ­ని చె­ప్పా­రు. అయి­తే అనం­తర కా­లం­లో ప్రా­జె­క్టు అమ­లు­లో ఆల­స్యం జరి­గిం­ద­ని, మధ్య­లో అధి­కా­రం­లో ఉన్న ప్ర­భు­త్వం పూ­ర్తి­కా­ని ప్రా­జె­క్టు­ను 2024 మా­ర్చి­లో జా­తి­కి అం­కి­తం చే­సి­న­ట్లు ప్ర­క­టిం­చ­డం ప్ర­జ­ల­ను మోసం చే­య­డ­మే­న­ని వి­మ­ర్శిం­చా­రు. ప్రా­జె­క్టు పూ­ర్తి చే­సేం­దు­కు మొ­త్తం రూ.9 వేల కో­ట్లు అవ­స­ర­మ­వు­తా­య­ని, ఇప్ప­టి­వ­ర­కు రూ.5,455 కో­ట్లు ఖర్చ­య్యా­య­ని సీఎం వె­ల్ల­డిం­చా­రు. గత ఐదే­ళ్ల పా­ల­న­లో కే­వ­లం రూ.500 కో­ట్ల మేర పను­లు మా­త్ర­మే జరి­గా­య­ని ఆరో­పిం­చా­రు. ప్ర­స్తు­తం తమ ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత 20 నె­ల­ల్లో­నే రూ.540 కో­ట్లు వె­చ్చిం­చి పను­లు వే­గ­వం­తం చే­సి­న­ట్లు తె­లి­పా­రు.

 తొలి దశ పూ­ర్తి కా­వా­లం­టే....

వె­లి­గొండ తొలి దశ పూ­ర్తి కా­వా­లం­టే ఇంకా రూ.2 వేల కో­ట్లు అవ­స­ర­మ­ని పే­ర్కొ­న్నా­రు. వచ్చే జూలై నా­టి­కి ఫ్లో­రై­డ్ ప్ర­భా­విత గ్రా­మా­ల­కు తా­గు­నీ­రు అం­దిం­చ­డ­మే లక్ష్య­మ­ని ఆయన హామీ ఇచ్చా­రు.మార్కాపురం జిల్లాలో ఫ్లోరైడ్ స్థాయులు 2.5 నుంచి 5 పీపీఎం వరకు, కొన్ని ప్రాంతాల్లో 7 పీపీఎం వరకు నమోదవుతున్నాయని సీఎం వివరించారు. ఈ కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందుకే వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ ప్రాధాన్యమని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టును పలు మార్లు పరిశీలించారని, ప్రతి సోమవారం పురోగతి నివేదిక తీసుకుంటూ పనులను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించి రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడి పత్తి, మిరప, అరటి, బొప్పాయి, బత్తాయి వంటి పంటలకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మార్కాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రాజకీయ అంశాలపై కూడా స్పందించారు. ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా ఇస్తేనే వస్తానని చెప్పడం సరికాదని విమర్శించారు.

Tags:    

Similar News