CBN: రైతుల కళ్లల్లో ఆనందంతో నా జన్మ ధన్యమైంది

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు... కరెన్సీ టెక్నాలజీతో పట్టాదారు పాసు పుస్తకాలు... 21 నెలల పాలనతోనే రైతుల జీవితాల్లో సంతోషం

Update: 2026-04-10 03:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో భూ­హ­క్కుల పరి­ర­క్ష­ణ­కు కీలక అడు­గు వే­స్తు­న్న­ట్లు ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు వె­ల్ల­డిం­చా­రు. బా­ప­ట్ల జి­ల్లా సూ­రే­ప­ల్లి గ్రా­మం­లో ని­ర్వ­హిం­చిన “మీ భూమి – మీ హక్కు” కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్న ఆయన, రై­తు­ల­కు కొ­త్త పట్టా­దా­రు పా­స్‌­పు­స్త­కా­ల­ను పం­పి­ణీ చే­స్తూ ప్ర­భు­త్వ లక్ష్యా­ల­ను వి­వ­రిం­చా­రు. ఈ పా­స్‌­పు­స్త­కా­లు సా­ధా­రణ పత్రా­లు కా­కుం­డా, కరె­న్సీ నో­ట్లు తయా­రీ­కి ఉప­యో­గిం­చే భద్ర­తా సాం­కే­తి­క­త­తో రూ­పొం­దిం­చా­మ­ని ఆయన ప్ర­త్యే­కం­గా పే­ర్కొ­న్నా­రు. రై­తుల చే­తు­ల్లో­కి ఈ పు­స్త­కా­లు వె­ళ్లి­న­ప్పు­డు వారి కళ్ల­లో కని­పిం­చిన ఆనం­దం తనకు ఎంతో సం­తృ­ప్తి­ని ఇచ్చిం­ద­ని సీఎం తె­లి­పా­రు. భూమి రై­తు­కు కే­వ­లం ఆస్తి మా­త్ర­మే కా­కుం­డా జీ­వ­నా­ధా­రం, గౌ­ర­వం, భద్ర­త­కు ప్ర­తీక అని ఆయన వ్యా­ఖ్యా­నిం­చా­రు. గత ప్ర­భు­త్వం­లో భూ వ్య­వ­స్థ­లో ఏర్ప­డిన సమ­స్య­ల­ను సరి­ది­ద్దేం­దు­కు ప్ర­స్తుత ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని చె­ప్పా­రు. భూ­ము­ల­పై వి­వా­దా­లు పె­రి­గి ప్ర­జ­లు ఇబ్బం­దు­లు పడిన పరి­స్థి­తి­ని మా­ర్చ­డ­మే లక్ష్య­మ­ని వి­వ­రిం­చా­రు.

ఈ పా­స్‌­పు­స్త­కాల పం­పి­ణీ కా­ర్య­క్ర­మా­న్ని వ్య­వ­స్థ­బ­ద్ధం­గా కొ­న­సా­గి­స్తా­మ­ని, ప్ర­తి నెలా 9వ తే­దీన ఒక ప్రాం­తం­లో రై­తు­ల­కు అం­ద­జే­స్తా­మ­ని సీఎం హామీ ఇచ్చా­రు. 2027 మా­ర్చి నా­టి­కి మొ­త్తం 1.12 కో­ట్ల పా­స్‌­పు­స్త­కా­ల­ను అం­దిం­చా­ల­నే లక్ష్యా­న్ని ప్ర­భు­త్వం పె­ట్టు­కు­న్న­ట్లు తె­లి­పా­రు. ఇప్ప­టి­కే లక్ష­లా­ది పా­స్‌­పు­స్త­కా­లు ఇచ్చా­మ­ని, రా­బో­యే నె­ల­ల్లో ఈ ప్ర­క్రి­య­ను వే­గ­వం­తం చే­స్తా­మ­ని అన్నా­రు. పా­స్‌­పు­స్త­కా­ల­లో క్యూ­ఆ­ర్ కోడ్, డి­జి­ట­ల్ లాక్ వంటి సౌ­క­ర్యా­లు కల్పిం­చ­డం ద్వా­రా రి­కా­ర్డు­లు ఎవరూ మా­ర్చ­లే­ని వి­ధం­గా చర్య­లు తీ­సు­కు­న్నా­మ­ని చె­ప్పా­రు.  అదేవిధంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డులను శాశ్వతంగా రక్షించే వ్యవస్థను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈకేవైసీ పూర్తయిన తర్వాతే పాస్‌పుస్తకాలు ఇవ్వడం ద్వారా పారదర్శకతను పెంచుతున్నామని చెప్పారు

రా­ష్ట్ర అభి­వృ­ద్ధి అం­శా­ల­పై మా­ట్లా­డు­తూ, సూ­ర్య­లంక బీ­చ్‌­ను అం­త­ర్జా­తీయ స్థా­యి­లో అభి­వృ­ద్ధి చేసి గోవా తర­హా­లో పర్యా­టక కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని సీఎం తె­లి­పా­రు. దీం­తో ఉపా­ధి అవ­కా­శా­లు పె­రు­గు­తా­య­ని ఆశా­భా­వం వ్య­క్తం చే­శా­రు. అలా­గే మత్స్య­కా­రుల ప్ర­యో­జ­నాల వి­ష­యం­లో ప్ర­భు­త్వం కఠి­నం­గా వ్య­వ­హ­రి­స్తుం­ద­ని, వారి జీ­వ­నో­పా­ధి­కి ఎలాం­టి భంగం కలి­గి­నా ఉపే­క్షిం­చ­బో­మ­ని హె­చ్చ­రిం­చా­రు. రా­జ­కీయ అం­శా­ల­పై కూడా స్పం­దిం­చిన సీఎం, గత పా­ల­న­లో జరి­గిన తప్పి­దాల వల్ల వ్య­వ­స్థ­లు దె­బ్బ­తి­న్నా­య­ని వి­మ­ర్శిం­చా­రు. అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి వి­ష­యం­లో ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని, దా­న్ని దే­శం­లో­నే ప్ర­ముఖ రా­జ­ధా­ని­గా తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. మొ­త్తం మీద ప్ర­జల ఆస్తు­ల­కు రక్షణ కల్పిం­చ­డం, భూ సమ­స్య­ల­కు శా­శ్వత పరి­ష్కా­రం చూ­పిం­చ­డం ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్య­మ­ని ఆయన పు­న­రు­ద్ఘా­టిం­చా­రు. ఆస్తుల కోసం తల్లీ చె­ల్లి­ని రో­డ్డు­కీ­డ్చిన వ్య­క్తి­ని ఎవ్వ­రూ ఆద­ర్శం­గా తీ­సు­కో­వ­ద్ద­ని సీఎం చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు. బా­బా­య్ ను చంపి ఆ నేరం తనపై వే­శా­డ­ని దు­య్య­బ­ట్టా­రు.

Tags:    

Similar News