వైసీపీ లీడర్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక లాగా తయారైందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా అవినీతి కేసుల్లో దొరికిపోతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా రెచ్చిపోయి.. బూతులు తిడుతూ జగన్ కళ్లలో పైశాచిక ఆనందాన్ని చూడటానికి ఇష్టపడ్డారు. కానీ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇప్పటికే కల్తీ లిక్కర్, లిక్కర్ స్కామ్, కల్తీ నెయ్యి కేసులు.. భూ కబ్జాలు, మర్డర్లు ఇలా ఒక్కటా రెండా.. అనేక కేసుల్లో వారు దొరికిపోతున్నారు. ఇప్పటికే ఆ కేసులు అంతిమ లబ్దిదారుడి దాకా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ కూడా బెంగుళూరు ప్యాలెస్ లో తన పార్టీ నేతల అవినీతిని కవర్ చేయడానికి చాలా ప్లాన్లు వేస్తున్నారు.
కానీ అవన్నీ బెడిసికొడుతున్నాయి. ఇప్పుడు మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఆడుదాం ఆంధ్రా స్కామ్ లో అడ్డంగా దొరికిపోయారు. జగన్ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ.. ఏదో ఒక సంచలన ప్రకటన చేసేసి ప్రజల దృష్టిని తమ అవినీతి నుంచి తప్పించాలని వైసీపీ నేతలు వేడుకుంటున్నారు. జగన్ కూడా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నా.. ప్రజలు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు.
ఇప్పుడు మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా జగన్ వద్దకు వెళ్తున్నారంట. తమ అవినీతిని కవర్ చేయడానికి ఏదో ఒక ప్లాన్ వేయాలని కోరుతున్నారంట. తమ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించి తమను కేసుల్లో ఇరుక్కోకుండా చూడాలంటూ వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ తాను ఎన్ని ప్లాన్లు వేసినా ప్రజలు కనీసం చూడట్లేదని జగన్ చెబుతున్నారంట. దీంతో వైసీపీ బ్యాచ్ మొత్తం ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.